KGF Chapter 2 నుంచి అదిరిపోయే ఆఫర్: ఏది కావాలో డిసైడ్ చేయండంటూ!

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సౌతిండియా సినిమాల స్టామినా అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. దీనికి కారణం దక్షిణాదిలో ఉన్న అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రతిష్టాత్మక చిత్రాలు వస్తుండడమే. ఇలా వచ్చి సెన్సేషన్ అయిన సినిమాల్లో 'KGF Chapter 1' ఒకటి. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది.

'KGF Chapter 1' అన్ని భాషల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. దీంతో శాండిల్‌వుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వస్తోంది. 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయినా.. అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.

 KGF Chapter 2 Unit Offer to Movie Lovers

చాలా కాలం పాటు సాగుతూ వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' షూటింగ్‌ను గత ఏడాది చివర్లో పూర్తి చేసుకున్నారు. ఇక, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్ దాదాపుగా పూర్తి చేసేశారు. దీంతో ఈ సినిమాను గత ఏడాదే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో సినిమాకు సంబంధించిన మిగిలిన పనులను చిన్నగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో ఖాతాల్లో సినీ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇందులో 'కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం మీరు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారన్న మాకు బాధాకరం. మా సినిమాపై మీ ఆసక్తికి సంతోషంగానూ ఉంది. అసలు మా చిత్రం నుంచి మీరు ముందుగా ఏది చూడాలని అనుకుంటున్నారు' అంటూ పాటనా? ట్రైలర్‌నా? మేమే సర్‌ప్రైజ్ చేయాలా? అనే ఆప్షన్లను కూడా ఉంచారు. ఇందులో చాలా మంది నెటిజన్లు ట్రైలర్‌కే జై కొట్టారు. ఇంతకీ దీని నుంచి ముందుగా ఏది వస్తుందో చూడాలి.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X