twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నంకు నో శంకర్‌కు యస్.. రాకీ భాయ్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో.. దేశాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడు కన్నడ రాక్ స్టార్ యష్. కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన యష్.. ప్యాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. కె.జి.యఫ్.. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 250కోట్లను కొల్లగొట్టిన కె.జి.యఫ్ బాలీవుడ్‌లో స్టార్ హీరోలకు గట్టిపోటినిచ్చింది.

    ఓవర్ నైట్ స్టార్..

    ఓవర్ నైట్ స్టార్..

    ఈ ఒక్క చిత్రంతో యష్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘ఎవ్వరూ రాత్రికి రాత్రే స్టార్ అవ్వరని.. ఓ వ్యక్తి చాలా సంవత్సరాలు కష్టపడితేనే స్టార్ డమ్ వస్తోందని.. నేను అలా కష్టపడిన వ్యక్తినేనని.. ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటే గానీ తనకు ఈ గుర్తింపు వచ్చిందని.. 2008 నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను నిర్మించుకున్నాన'ని ఇన్నాళ్ల తన కష్టాన్ని అందరి ముందు చెప్పుకొచ్చాడు.

    భారీ ఎత్తున సీక్వెల్..

    భారీ ఎత్తున సీక్వెల్..

    ప్రస్తుతం కె.జి.యఫ్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించనున్నాడన్న సంగతి తెలిసిందే.

    ఫస్ట్ లుక్..

    ఫస్ట్ లుక్..

    చాప్టర్ 2 కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవని బాధపడుతున్న రాకీ భాయ్ ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టైటిల్ లుక్ తాజాగా రివీలైంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.

    శంకర్‌తో సినిమా..

    శంకర్‌తో సినిమా..

    ఇటీవల జరిగిన బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ కార్యక్రమంలో అవార్డు అందుకున్న యశ్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. సౌత్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం మరియు శంకర్‌లలో మీరు ఎవరితో సినిమా చేస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే ఏమాత్రం తడుముకోకుండా.. శంకర్ దర్శకత్వంలో చేయాలనేది తన కోరిక అంటూ చెప్పుకొచ్చాడు.

    English summary
    KGF Fame Yash Wants To DO A Film With Shankar. Now He Is Busy With KGF Chapter 2. Sanjay Dutt Is Playing An important role. This Movie Is Directed By Prashanth Neel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X