వెరైటీ టైటిల్‌తో ప్రయోగం.. కేజీయఫ్ గరుడతో తలపడనున్న శ్రీవిష్ణు
ఇమేజ్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పట్టంకట్టే హీరోలు కొందరే ఉంటారు. సినిమాలో పాత్రలు మాత్రమే కనిపించేలా నటించేవారు కొంత మందే ఉంటారు. అందులో శ్రీవిష్ణు ఒకరు. అలా శ్రీవిష్ణు చేసే చిత్రాలన్నీ కూడా కథా బలమున్నవే. అలాంటి శ్రీ విష్ణు తాజాగా ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ మూవీని వారాహీ చలనచిత్రం బ్యానర్‌లో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నాడు.
'బాణం' సినిమాతో తన సత్తాను చాటిన దర్శకుడు చైతన్య దంతులూరి మరో విభిన్న కథను ఎంచుకున్నాడు. శ్రీవిష్ణు, కేజీయఫ్ విలన్ గరుడ ( రామ చంద్రరాజు), కేథరిన్ వంటి వారితో ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ మూవీకి వెరైటీ టైటిల్ పెట్టి అందరీన ఆకర్షించారు. 'భళా తందనాన' అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవానికి రాజమౌళి ఫ్యామిలీ హాజరైంది.

'భళా తందనాన' సినిమాను మంగళవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, శ్రీశైల దేశస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్ నివ్వగా, ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్టును శ్రీవల్లి (కీరవాణి సతీమణి), రమ (రాజమౌళి సతీమణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్యక్రమంలో హీరో నారా రోహిత్, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











