Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కియారా అద్వానీ మరో అడల్ట్ మూవీ.. ఆడవారిని కించపర్చినట్లే! సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..
బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరో అడల్ట్ మూవీకి కమిటైంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి నటించిన ఈ భామ ఈ సారి డిఫరెంట్ అడల్ట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కియారా సినిమాపై కంగనా సోదరి రంగోలి తనదైన కోణంలో స్పందించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ విషాలేంటో చూద్దామా..

ఇందూ కీ జవానీ మూవీ
టాలీవుడ్ లో ఇటీవలే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసి గ్లామర్ పరంగా వెరీ హాట్ అని పేరుతెచ్చుకున్న కియారా.. బాలీవుడ్, వెబ్ సిరీస్ ఇలా ఎలాంటి అవకాశమొచ్చినా కాదనడం లేదు. అడల్ట్ స్టోరీ అయితే మరీ బెటర్ అన్నట్లుగా ఉంది అమ్మడి తీరు. ఈ నేపథ్యంలో ఇందూ కీ జవానీ అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది.

డిఫెరెంట్ అడల్ట్ స్టోరీ
ఇందూ కీ జవానీ మూవీ ఓ డిఫెరెంట్ అడల్ట్ స్టోరీ అని తెలుస్తోంది. బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందనుందట. డేటింగ్ యాప్స్‌లో అబ్బాయిలను పరిచయం చేసుకుని వారితో డేట్ చేసే పాత్రలో కియారా పర్‌ఫార్మ్ చేయనుందని సమాచారం. దీంతో ఇప్పటికే లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ద్వారా అడల్ట్ స్టార్‌గా సంచలనం సృష్టించిన కియారా అద్వానీ.. ఇక ఇందూ కీ జవానీ ద్వారా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అనే టాక్ వినిపిస్తోంది జనాల్లో.

ఈ లోగా రంగంలోకి కంగనా సోదరి
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రెటీలపై, హీరోయిన్లపై కంగనా రనౌత్ కంటే ఎక్కువగా ఆమె సోదరి రంగోలీనే ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. అన్ని విషయాల్లో జోక్యం కల్పించుకొని మరీ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తూ కొందరు ప్రముఖులను ఏకి పారేస్తోంది రంగోలి. ఈ నేపథ్యంలో తాజాగా కియారా చేస్తున్న ఇందూ కీ జవానీ మూవీ విషయంలోనూ రంగంలోకి దిగింది రంగోలి.
ఎవరితో పడుకోవాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే డిసైడ్.. కంగన సొదరి ఫైర్

ఆడవారిని అవమానించినట్లే అంటూ
మహిళ సాధికారత కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న ఈ తరుణంలో ఇలాంటి టైటిల్‌తో సినిమాలు తీయడం ఏ మాత్రం సబబు కాదు. మహిళను ఆట బొమ్మలా చూపించే ఇలాంటి సినిమాలను రావడం చట్ట విరుద్ధమే. ఒకవేళ ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే అది ఆడవారిని అవమానించినట్లే అవుతుందంటూ తనదైన కామెంట్‌తో ఇందూ కీ జవానీ మూవీపై ఆగ్రహం వ్యక్తం చేసింది రంగోలి.

ఆసక్తికర కథాంశం.. ప్రస్తుతం కావాల్సింది అదే
నేటి యువత ఎక్కువగా ఇలాంటి ఆసక్తికర కథాంశాలనే ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా డిఫెరెంట్ స్టోరీస్, అందునా అడల్ట్ కంటెంట్ ఉండేలా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో నటించేందుకు కియారా లాంటి భామలు సై అంటున్నారు. రంగోలి లాంటి విమర్శలు నై అంటున్నారు. దీంతో విడుదలకు ముందే నలుగురి నోళ్ళలో నాని నాని విడుదలయ్యాక సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతున్నాయి సదరు సినిమాలు. అంతేనా? కాదా? మేరే చెప్పండి మరి.