ఆడ, మగ రిలేషన్‌షిప్‌పై కియారా అద్వానీ ఓపెన్ కామెంట్స్.. డేటింగ్, రొమాన్స్‌పై క్లారిటీ

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లవ్, రొమాన్స్, రిలేషన్‌షిప్స్‌ గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్

మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో రొమాన్స్

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు కొత్త అందం తీసుకొచ్చింది కియారా. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో మాయ చేసింది. బట్ ఈ సినిమా అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో తిరిగి బాలీవుడ్ చెక్కేసింది ఈ బ్యూటీ.

ఆడ, మగ రిలేషన్‌షిప్.. నోరువిప్పిన కియారా

ఆడ, మగ రిలేషన్‌షిప్.. నోరువిప్పిన కియారా

ప్రస్తుతం బాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా అద్వానీ బ్రైడల్ లుక్‌‌ను బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ ఫిబ్రవరి నెల కవర్ పేజీపై ముద్రించింది. ఈ సందర్భంగా ఆమెను బ్రైడల్ లుక్‌‌‌లో ఫోటో షూట్ చేశారు. ఇకపోతే ఇదే బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఆడ, మగ రిలేషన్‌షిప్ పై ఓపెన్ కామెంట్స్ చేసింది.

కియారా అద్వానీ రిలేషన్‌షిప్.. క్లారిటీ

కియారా అద్వానీ రిలేషన్‌షిప్.. క్లారిటీ

తాను ఎవ్వరితో రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది కియారా అద్వానీ. రిలేషన్‌షిప్ లాంటివి తాను పెద్దగా నమ్మనని కూడా చెప్పి షాకిచ్చింది. అంతేకాదు ఓ సారి రిలేషన్‌షిప్ పెట్టుకుంటే దానికే బాండింగ్ అయి ఉండాలని, ఆ రిలేషన్‌ గురించి బయట చెప్పుకోవడానికి భయపడకూడదని అంటోంది కియారా.

డేటింగ్ చేయడంలోనూ తప్పు లేదు

డేటింగ్ చేయడంలోనూ తప్పు లేదు

ఇకపోతే ఆడ, మగ రిలేషన్‌షిప్‌ ఎలా ఉండాలో చెప్పిన కియారా.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అంటోంది. కాబోయే పార్ట్‌నర్‌తో డేటింగ్ చేయడంలోనూ తప్పులేదంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే రిలేషన్‌షిప్‌ బ్రేక్ చేయకుండా ఒక్కటై ఎప్పటికీ కలిసుండాలని ఆమె చెబుతోంది.

భర్తతో సన్నిహిత సంబంధం.. ఎక్కడైనా

భర్తతో సన్నిహిత సంబంధం.. ఎక్కడైనా

అదేవిధంగా పెళ్లి తర్వాత భర్తతో సన్నిహిత సంబంధం గురించి ఎక్కడైనా మాట్లాడేటపుడు భయపడొద్దని కియారా చెప్పుకొచ్చింది. భర్తతో సన్నిహిత సంబంధం గురించి తల్లి దగ్గర ప్రస్తావన వచ్చినా నాచురల్‌గా పంచుకోవాలని ఆమె తెలిపింది.

Recommended Video

Vijay devarakonda & Kiara Advani Spotted At Manish Malhotra House
కియారా స్పీడ్.. మరోసారి అదే హీరోతో

కియారా స్పీడ్.. మరోసారి అదే హీరోతో

ఇటీవలే బాలీవుడ్ మూవీ 'గుడ్ న్యూస్'తో సందడి చేసిన ఈ భామ.. ప్రస్తుతం షేర్షా, లక్ష్మి బాంబ్, ఇందూ కీ జవానీ, భూల్ భులైయా 2 చిత్రాల్లో నటిస్తోంది. లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్‌తో తెలుగులో మరో సినిమా చేసేందుకు సిద్దమైందట కియారా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X