శృతిమించిన కియారా విరహ వేదన.. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా రెచ్చిపోయి ఆ హీరోతో! వీడియో
కియారా అద్వానీ రెచ్చిపోయి రొమాన్స్ చేసేసింది. హీరోతో ఘాటు ముద్దుల్లో మునిగిపోయి కనీసం చుట్టూ ఉన్న మనుషులను కూడా పట్టించుకోలేదు. తాజాగా బయటకొచ్చిన వీడియోలో ఈ బాలీవుడ్ భామ విరహ వేదన చూస్తుంటే మతి పోతోంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ వంటి అడల్ట్ మూవీతో తనలో ఉన్న విరహాన్ని ప్రేక్షకుల ముందుంచిన కియారా అద్వానీ తాజాగా విడుదలైన ఈ వీడియోలో శృతిమించి పర్‌ఫార్మ్ చేసింది. ఆ వివరాలు చూద్దామా..

కబీర్ సింగ్ మూవీ
తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా హిందీలో కబీర్ సింగ్ మూవీ తెరకెక్కుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ కబీర్ సింగ్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

తాజాగా బెఖయాలి వీడియో
విడుదలకు సిద్దమవుతున్న కబీర్ సింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని బెఖయాలి అనే వీడియో రిలీజ్ చేశారు. ఇర్షాద్ కామిల్ అద్భుతమైన సాహిత్యంతో సాచేత్ పరంపర సంగీతం ఈ పాటలో హైలైట్ అవుతోంది. ప్రేయసి దూరమయ్యాక శూన్యమే జీవితంగా తాగుడే లోకంగా మారిపోయిన ఓ యువ డాక్టర్ వేదనను ఈ సాంగ్ లో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
హీరోతో కియారా లిప్‌లాక్
అర్జున్ రెడ్డి సినిమా అంటేనే లిప్‌లాక్స్ మాయ. తెలుగులో లాగానే హిందీ అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్‌లో కూడా లిప్‌లాక్‌లకు కొదవలేదని ఇప్పటికే ట్రైలర్‌తో సందీప్ రెడ్డి ప్రూవ్ చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో మరింత ఘాటు ముద్దు సీన్లు చూపించి సినిమాపై హైప్ పెంచేశారు. చుట్టూ అందరూ చూస్తుండగానే మై మరచిపోయి హీరోతో కియారా లిప్‌లాక్స్ చేసే సన్నివేశాలు ఈ వీడియో రేంజ్ పెంచేశాయి. ఈ సీన్లతో షాహిద్ కపూర్ కీయరా అద్వాని జంట బాగా ఆకట్టుకుంది.

తెలుగు వారికే ఈర్ష కలిగేలా
వీడియో చూస్తుంటే తెలుగులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి ధీటుగా హిందీలో షాహిద్ కపూర్ పర్‌ఫార్మ్ చేశాడని తెలుస్తోంది. హీరో షాహిద్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు తెలుగు ప్రేక్షకులకు ఈర్ష కలిగించేలా ఉంది. జూన్ 21న విడుదల కానున్న కబీర్ సింగ్‌పై బాలీవుడ్ జనం బాగా ఆశలు పెట్టుకున్నారు.

కియారా సినిమాలంటారా..
మరికొద్ది రోజుల్లో షాహిద్ కపూర్ సరసన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో ప్రేక్షాకుల ముందుకు రాబోతోంది. అలాగే కాంచన సినిమాకు రీమేక్‌గా రాబోతున్న లక్ష్మి బాంబ్ సినిమాలో కూడా కియారా కీలక పాత్ర పోషిస్తోంది. కబీర్ సింగ్ టీజర్‌పై ప్రభాస్ కూడా పాజిటివ్‌గా స్పందించడం కియారా కెరీర్‌కి పూల బాట అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











