మహేష్ హీరోయిన్ గిల్టీ ఫీలింగ్.. ఎందుకో మీరే చూడండి
తన మొదటి సినిమా 'భరత్ అనే నేను' మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు గాలం వేసేసింది కియారా అద్వానీ. అప్పటికే బాలీవుడ్ లో గ్లామర్ పరంగా పేరు తెచ్చుకున్న ఈ భామ మహేష్ బాబు సరసన నటించి భేష్ అనిపించుకుంది. అయితే అదే కియారా ఇప్పుడు 'గిల్టీ' గా ఫీల్ అవుతోంది. కాకపోతే ఏదైనా తప్పు చేసి కాదు.. ఓ వెబ్ సిరీస్ కోసం. 'గిల్టీ' పేరుతో నెట్‌ఫ్లిక్స్ కోసం ఆమె ఓ వెబ్ సిరీస్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబందించి కియారా లుక్ బయటకు వదిలారు.
రుచి నరైన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించనున్నారు. గతంలో కియారా లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన కారణంగా ఈ సిరీస్ లో ఎలా కనిపించనుంది అనే ఆసక్తి మొదలైంది జనాల్లో. అయితే తనకు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఒక్కటే అని చెబుతోంది కియారా. నేటి యువతరం ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. కాబట్టి వాళ్లకి మరింత దగ్గర కావడానికి అవి చేయడంలో తప్పు లేదనేది తన అభిప్రాయం అని గతంలోనే చెప్పేసింది కియారా.

ఇక కియారా సినిమాలంటారా..! తెలుగులో సంచలన విజయ సాధించిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ చిత్రంలో నటించింది కియారా అద్వానీ. ఈ సినిమాలో షాహిద్ కపూర్ జంటగా ముద్దుల మాయలో పడటమే గాక యూత్‌లో మంచి క్రేజ్ కొట్టేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వారం లోపే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. మరోవైపు ప్రస్తుతం లక్ష్మీబాంబ్, షేర్షా అనే హిందీ సినిమాల్లో నటిస్తోంది కియారా కియారా. మొత్తంగా చూస్తే టాలీవుడ్, బాలీవుడ్, వెబ్ సిరీస్ ఏదీ వదలకుండా స్పెషల్ ట్రీట్స్ ఇస్తోంది కియారా.


Click it and Unblock the Notifications











