తెలుగుపై కియారా మమకారం, మరిన్ని సినిమాలు చేస్తేస్తానంటోన్న వయ్యారం

బాలీవుడ్ లో హీరోయన్ గా నిలదొక్కుకుంటోన్న సమయంలోనే టాలీవుడ్ లో వడివడిగా అడుగులు వేసిన కియారా అద్వానీ, వస్తూనే రామ్ చరణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో ఆడిపాడి జనాలపై ఓ చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కియారా, ఇక మళ్లీ ఇటువైపు చూస్తుందో లేదో అన్న డైలమాలో పడ్డ జనాలకు క్లారిటీ ఇచ్చేసింది.

ఇటీవలే గిల్టీ అనే వెబ్ ఫిల్మ్ లో నటించిన కియారా నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. దీంతో అమ్మడికి ఆఫర్ల తాకిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, ఓం రౌత్ ఆదిపురుష్ లోనూ సీతగా కియారా పేరునే పరిశీలిస్తున్నారు అంటే, అమ్మడు ఏ రేంజ్ లో హడావిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

Kiaras never ending love for South films

బాలీవుడ్ లో బిజీగా మారుతోంది కాబట్టి, అమ్మడు ఇక మళ్లీ టాలీవుడ్ వైపు ఎందుకు చూస్తుందిలే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కియారా మళ్లీ తెలుగులో నటించబోతోందట. ఇటీవలే ఇన్స్టా చాట్ ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించిన కియారా, తెలుగులో మళ్లీ నటిస్తారా అన్న ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది. అంతేకాదు, తెలుగునా పలు బడా సినీ నిర్మాణ సంస్థకు అమ్మడి డేట్లు పొందేందుకూ క్యూ కట్టేశాయని తెలుస్తోంది. ఏమైనా, స్టార్ డమ్ కు రీచ్ అవుతున్నా మూలాలను మరచిపోని ఈ చిన్నది మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X