ఆర్ఆర్ఆర్ గురించి వస్తోన్న వార్తలు అవాస్తవం.. స్పష్టతనిచ్చిన హీరో

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారతీయ సినీ చరిత్రలో బాహుబలిది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. అలాంటి సినిమాను తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో రాబోతోన్న తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్. ఆ చిత్రంపై అన్నీ భాషల ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

 భారీ మల్టీ స్టారర్..

భారీ మల్టీ స్టారర్..

టాలీవుడ్ టాప్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌ను అత్యంత భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ప్రాజెక్టుకు పలు అవాంతరాలు

ప్రాజెక్టుకు పలు అవాంతరాలు

ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ఆటంకాలు ఎదురువుతూనే ఉన్నాయి. అనుకున్న సమయానికి షెడ్యూల్ పూర్తి చేయకపోవడం, మొదటగా ప్రకటించిన హాలీవుడ్ హీరోయిన్ తప్పుకోవడం, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో రామ్ చరణ్ షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవడం, ఎన్టీఆర్ గాయాలపాలు కావడం, సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు బయటకు రావడం ఇలా ఎన్నో సమస్యలు వచ్చిపడుతున్నాయి.

సినిమా వాయిదా..?

జులై 30న ఆర్ఆర్ఆర్‌ను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని అనుకున్న తేదీకి తీసుకురాలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఎక్స్‌క్లూజివ్.. దక్షిణాది నుంచి ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సినిమా వాయిదా పడింది. ఆ సినిమా కోసం ముందుగా ప్రకటించిన డేట్ కంటే మరో డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 2020లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం'అంటూ చెప్పుకొచ్చాడు.

కిచ్చా సుదీప్ అంటూ మరో వార్త..

కిచ్చా సుదీప్ అంటూ మరో వార్త..

ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ నటించనున్నాడు, జనవరి 20 నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోన్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇది చివరకు ఆ హీరో వద్దకు చేరింది. దీంతో వీటిపై క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్‌పై వస్తోన్న వార్తల్లో నిజం లేదు.. ఆ చిత్రంలో నేను నటించడం లేదు.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వారు నన్ను గానీ, నేను వారిని గానీ సంప్రదించలేదంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X