నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో.. భారీ యాక్షన్ మూవీ
గరుడవేగతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ప్రవీణ్ సత్తారు ఓ క్రేజీకి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. గరుడ వేగ తర్వాత గ్యాప్ తీసుకొని రాసుకొన్న మరో ఇంట్రెస్టింగ్ కథతో సిద్ధమయ్యాడు. అయితే ఈ సారి మన్మథుడు నాగార్జున హీరో కావడంతో ఈ ప్రాజెక్టు మరింతా సెన్సేషనల్‌గా మారింది.
ప్రవీణ్ సత్తారు, నాగార్జున కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్, ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్ జీి జన్మదినం రోజును పురస్కరించుకొని ప్రకటించారు. ఈ చిత్రానికి నారంగ్ జీతోపాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నారాయణదాస్ జీ, పుస్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెడుతారని వెల్లడించారు.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందించే సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం బాధ్యతలతోపాటు కథ, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా ఓ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











