విజయ్ దేవరకొండ చేసిన మిస్టేక్ అదే.. 1000 శాతం చెప్పగలను.. నిర్మాత
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. తన రాబోయే స్సై యాక్షన్ ఫిల్మ్ కింగ్డమ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కింగ్డమ్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కెరీయర్ లో చేసిన సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంలో ఇచ్చిన పెర్ఫామెన్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
150 కోట్లతో కింగ్డమ్..
విజయ్ దేవరకొండ కెరీర్ లో గతంలో లైగర్ అనే చిత్రం భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది. దాదాపు 120 కోట్ల రూపాయాలు వెచ్చించారు. ఇక ఆ బడ్జెట్ ను మించి ప్రస్తుతం కింగ్డమ్ రూపుదిద్దుకోవడం విశేషం. కింగ్డమ్ చిత్రాన్ని 150 కోట్లతో రూపొందించామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా లోటు రాకుండా, అన్నీ క్రాఫ్ట్స్ నుంచి ది బెస్ట్ ఇచ్చేందుకు తొలుత అనుకున్న బడ్జెట్ కంటే 20 శాతం ఎక్కువగానే వెచ్చించామని చెప్పారు. నటీనటీలు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లతో పాటు నిర్మాణ ఖర్చులతో ఆ స్థాయిలో బడ్జెట్ అయ్యిందని తెలిపారు.

విజయ్ దేవరకొండపై నాగ వంశీ కామెంట్స్..
కింగ్డమ్ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నాగవంశీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గత చిత్రాలపై మాట్లాడారు. విజయ్ దేవరకొండ కేరీర్ లో అర్జున్ రెడ్డి, గీత గోవిందంలో డిఫెరెంట్ షేడ్స్ ల్లో చూడారన్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆయన కాలిబర్ కు తగినవి కాదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల్లో అదొక కంప్లైంట్ విజయ్ దేవరకొండపై ఉన్నట్టు గమనించామన్నారు. ఆయనకు సరైన కథ పడటం లేదని, కథలు ఎంచుకోవడంలో కాస్తా తడబడ్డాడనే అభిప్రాయం ఉందన్నారు.
కింగ్డమ్ ప్రామీస్ గా..
విజయ్ దేవరకొండను ఇప్పటి వరకు ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఒకలా చూశారు. కానీ కింగ్డమ్ చిత్రంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజయ్ దేవరకొండపై ఉన్న అన్నీ కంప్లైంట్స్ ను చెరిపేస్తారని నమ్ముతున్నట్టు నిర్మాత నాగ వంశీ తెలిపారు. కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ లెవల్ కు వెళ్తున్నట్టుగా అభిప్రాయపడ్డారు. కింగ్డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండ ఎంత మంచి ఆర్టిస్ట్ తో మీకే తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్ ను 100 శాతం కాదు 1000 శాతం వాడుకున్నామని చెప్పడం సినిమాపై అంచనాలను పెంచేసింది.
కింగ్డమ్ చిత్రం వివరాలు..
సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా రూపుదిద్దుకుంది కింగ్డమ్ చిత్రం. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం విశేషం. విజయ్ దేవరకొండ సరసన యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించడం విశేషం. జూలై 31న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











