Kingdom: రౌండప్ చేస్తున్నారు.. విజయ్ దేవరకొండని టచ్ చేస్తే .. నాగవంశీ మాస్ వార్నింగ్
టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ బడ్జెట్ ఎంత?
కింగ్డమ్‌లో సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

విజయ్‌పై ట్రోలింగ్
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కింగ్డమ్‌పై హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే విజయ్ ఇటీవల ఏం మాట్లాడినా.. ఏం చేసినా వివాదాస్పదమై కూర్చుంటోంది. ఆ వెంటనే సోషల్ మీడియాలో తారాస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. అలాగే ఆయన పేరుకు ముందు ది అన్న ట్యాగ్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో తన పేరు ముందున్న ది అన్న ట్యాగ్ తొలగించినట్లు విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
మౌనంగా విజయ్ దేవరకొండ
ఇటీవల తిరుపతిలో జరిగిన కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాయలసీమ భాషలో ఆయన చేసిన ప్రసంగంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలతో విజయ్ దేవరకొండ సంయమనం పాటిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ కింగ్డమ్ మూవీకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. దీనిని కూడా వదలకుండా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ ఇష్యూపై కింగ్డమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా మీట్‌లో మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
విజయ్ చుట్టూ తిరుగుతున్నారు
విజయ్ గారు కూడా మనలాగే ఓ మామూలు మనిషని, ఆయనను అనవసరంగా హంగామా చేయొద్దని నాగవంశీ సూచించారు. విజయ్ చాలా నార్మల్‌గా ఉంటారని.. హీరోగా అసలు బిహేవ్ చేయరని చెప్పారు. విజయ్ చుట్టూ చాలా టీమ్‌లు తిరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే ప్రమోషన్స్ అన్ని బాగా జరుగుతున్నాయని.. మా గోల్ ఓపెనింగ్ డే అని నాగవంశీ తేల్చిచెప్పారు. ట్రైలర్, లాస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని .. గత వారం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండటంతో ఆ మూడ్ చెడగొట్టడం ఇష్టం లేకనే ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నామని నాగవంశీ పేర్కొన్నారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో మీడియాతో మాట్లాడానికి, ఇంటర్వ్యూలు ఫేస్ చేసేంత టైం దొరకలేదని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











