Kingdom Movie Trailer Review: కింగ్డమ్ తెలుగు మూవీ ట్రైలర్ రివ్యూ
యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కలియుగ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే తదితరులు పాల్గొన్నారు. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకకు టాప్ యాంకర్ సుమ యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో మీరే చూడండి..

ట్రైలర్ విషయానికి వస్తే.. సూరి అనే యువకుడు ఓ ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పైగా మారాల్సి వస్తుంది. స్పైగా వెళ్లిన ప్రదేశంలోనే సొంత అన్ననే క్రిమినల్, మాఫియా డాన్ అని తెలుస్తుంది. అక్కడి భూమి, వాతావరణ పరిస్థితులు ఆయనను రెబెల్‌గా మారుస్తాయి. ఆ రాక్షస జాతికి నాయకుడిని చేస్తాయి. సూరి మాఫియా వర్గానికి డాన్‌గా ఎందుకు మారాడు? సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అతడిని లక్ష్యం ఏమిటి? దానిని ఎలా చేరుకొన్నాడనేది ఈ సినిమా కథ.
సూరిగా నటించిన విజయ్ దేవరకొండకు అన్నగా సత్యదేవ్, ప్రియురాలిగా భాగ్యశ్రీ భోర్సే నటించారు. యాక్షన్, ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ అంశాలు ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ సారి విజయ్ దేవరకొండకు విజయం దక్కడం ఖాయమనే విషయం ఖారారైనట్టుగా ట్రైలర్ చూస్తే అనిపించింది. 31వ తేదీన తెరపైకి వచ్చే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకొంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ గురించి ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











