చిరంజీవి సినిమాకు అదిరిపోయే టైటిల్: ఎన్నో వెతికి దాన్నే ఫైనల్ చేశారట
రీఎంట్రీలో సూపర్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో ఇది మెగా మల్టీస్టారర్‌గా మారిపోయింది. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారాయన. అందులో 'లూసీఫర్' తెలుగు రీమేక్ ఒకటి. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందబోయే ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.
కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో నటిస్తోన్నారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేలా అతడి క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు 'కింగ్ మేకర్' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ టైటిల్‌ను ఇంతకు ముందే అనుకున్నా.. మరిన్ని పేర్ల కోసం దీన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మాత్రం ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో పలు మార్పులు కూడా చేయించారు చిరంజీవి. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే దీని షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. హీరోయిన్‌గా అనుష్క శెట్టి నటిస్తున్నట్లు ఈ మధ్యనే ఓ వార్త బయటకు వచ్చింది. అలాగే, ఇందులో హీరో చెల్లెలిగా ప్రియమణి గానీ, సుహాసిని కానీ నటించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











