Meter దటీజ్ కిరణ్ అబ్బవరం.. వర్థమాన నటుడికి భారీ ప్రశంసలు

సినిమా పరిశ్రమలో రాణించాలనే కోరికతో ఎంతో మంది ప్రతీ రోజు హైదరాబాద్‌లో దిగుతుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ స్థానం ఉండాలనే లక్ష్యంతో ప్రతిభావంతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి కలను సాకారం చేసుకోవాలనే టార్గెట్ ఉన్న యువ ప్రతిభావంతుల్లో కుమార్ సాకారం ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు.

నెల్లూరు జిల్లాకు చెందిన కుమార్‌కు చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. బీటెక్ పూర్తి చేసిన కుమార్ సినిమాలపై ఆసక్తిపై సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. మజిలీ, ఓ బేబి, సార్, కొండ లాంటి సినిమాల రూపంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు.

 Kiran Abbavaram

సినిమాలే కాకుండా షార్ట్ ఫిలింస్‌లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలా తాను నటించిన షార్ట్ ఫిలింను చూసిన మీటర్ దర్శకుడు రమేష్.. కుమార్ ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారు. మీటర్ చిత్రంలో కూడా తన పాత్రను ప్రభావవంతంగా చేయడంతో హీరో కిరణ్ అబ్బవరం, రమేష్ సంతృప్తి చెందారు.

ఇటీవల జరిగిన మీటర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కుమార్‌తో ఉన్న షార్ట్ ఫిల్మ్ జర్నీ హీరో కిరణ్ అబ్బవరం గుర్తు చేసుకొన్నాడు. కుమార్ కాసారం టాలెంట్‌పై కిరణ్ అబ్బవరం ప్రశంసలు గుప్పించారు. తనతోపాటు షార్ట్ ఫిలింలో నటించి మెప్పిస్తున్న కుమార్‌ను అభినందించారు. తనతోపాటు జర్నీ చేసిన కుమార్‌ను అభినందించిన తీరు చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు.

మీటర్ రిలీజ్ కాకుండానే కుమార్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే భారీ ప్రాజెక్టులో ఓ సినిమా పూర్తి చేశాడు. మరో బ్యానర్‌లో కూడా సినిమా చేసున్నారనే విషయం తన స్నేహితులు చెప్పడం గమనార్హం. ప్రతిభ, కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే సినిమా పరిశ్రమలో రాణించడం సులభం కాదనే విషయాన్ని కుమార్ కాసారం నిజం చేసే దిశగా వెళ్తున్నాడు. కుమార్ కాసారంకు మంచి భవిష్యత్ ఉండటమే కాకుండా.. నటుడిగా మరిన్ని విజయాలు సాధించాలని తెలుగు ఫిల్మీబీట్ కోరుకొంటూ.. ఆల్ ది బెస్ట్ కుమార్ కాసారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X