ఆ కంపెనీకి నేం ద్రోహం చేశాను , ఎందుకీ కక్ష .. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి , నానా కష్టాలు పడి సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ సినిమా థియేటర్ వరకు చేరుకుని, ప్రేక్షకుడిని మెప్పించడం అంత ఈజీ కాదు. దిగ్గజాల వంటి నటులు, దర్శక నిర్మాతలే ఈ విషయంలో ఫెయిలైన దాఖలాలు చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. ఇదొక గొడవైతే, కొన్ని సినిమాలను, హీరోలను టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక కొందరు నటీనటుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా సినిమాల్లోనే ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ పరిణామాలపై యువ హీరో కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండ్రోజుల క్రితం సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నెగిటివ్ రివ్యూలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా గొడవ ఇంకా సద్దుమణగలేదు. దరిద్రానికి వీరేచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారట , క్రిముల దొడ్డి నాకేటోళ్లు అంటూ నోరు పారేసుకున్నారు. అందరం కలిసి ఇలాంటి వాళ్లని ఆపేయాలని , జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం రాని వాళ్లు వచ్చి నోటికొచ్చినట్లు రాస్తున్నారంటూ అసభ్యపదజాలంతో దూషించారు . మాకు ప్రజలున్నారని, వాళ్లే సినిమాను ముందుకు తీసుకెళ్తారని , మీ రివ్యూలు మాకేం అక్కర్లేదని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై ఫిల్మ్ జర్నలిస్టులు భగ్గుమన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి యువ హీరో కిరణ్ అబ్బారం చేరారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కిరణ్.. షార్ట్ ఫిలింస్ తీసుకుంటూ హీరోగా ఎదిగాడు. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమంటపం, సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినదాణ్ణి, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ తదితర చిత్రాలతో తన కంటూ పేరు తెచ్చుకున్నాడు.
ఆయన లేటెస్ట్ మూవీ క. సుజీత్, సందీప్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపావళి కానుకగా క ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరగ్గా.. నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పనిగట్టుకుని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని.. ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన తాను సినిమాల్లో నటించడమే పెద్ద విజయమన్నారు. నాతో మీకు ప్రాబ్లం ఏంటీ..? కిరణ్ అనే వాడు ఎదగకూడదా అని ఆయన ప్రశ్నించారు.
Chaibisket🤣 Papam aa SharatWhat gadu ikkada ego ki poi Movies script lo Kiran meeda comedy🙏 pic.twitter.com/bxpT1f7OcI
— Johnnie Walker🚁 (@Johnnie5ir) October 29, 2024
తాను నటించిన 8 సినిమాల్లో నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయని.. నేను ఫెయిల్యూర్ యాక్టర్‌ని కాదని కిరణ్ అన్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉందని.. వాళ్ల సినిమాలలో నన్ను ట్రోల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నా కోసం , కుటుంబం కోసం అమ్మ ఎంతో కష్టపడిందని కూలీ పనులు చేసి మమ్మల్ని చదివించిందని .. సినిమాలలో తానేంటో నిరూపించుకుని అమ్మ సంతోషపడేలా చేయాలని అనుకున్నానని కిరణ్ తెలిపారు.
సినిమా గురించి కష్టపడే విషయంలో ఎప్పుడూ తగ్గలేదని.. హిట్స్, ఫ్లాప్స్ అనేవి ప్రతి నటుడి జీవితంలో కామన్ అని కిరణ్ అన్నారు. కొన్నిసార్లు నిద్రలేక స్క్రీన్‌పై సరిగా కనిపించేవాడిని కాదని.. ఆ విషయంలోనూ తనను ట్రోల్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన చెప్పిన కంపెనీ ఏది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











