కేవలం 5 షోలు ఇవ్వమన్నా ఇవ్వలేదు.. తమిళ ఇండస్ట్రీ తీరుపై.. కిరణ్ అబ్బవరం ఆవేదన
భాషా భేదాలు లేకుండా ఎవరు సినిమా తీసినా ఆదరించే గొప్ప మనసు మన తెలుగు వాళ్లది . హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళ నటుల సినిమాల డబ్బింగ్ వెర్షన్‌లను తెలుగు వారు ఎగబడి చూశారు.. ఇంకా చూస్తూనే ఉన్నారు. మనవాళ్లు తమిళ చిత్రాలను, ఆ హీరోలను నెత్తిన పెట్టుకుంటుంటే తమిళ తంబీలు మాత్రం తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు. అంతెందుకు తమిళనాడులో మన చిత్రాలకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్ధితి. తాజాగా యువ హీరో కిరణ్ అబ్బవరం తమిళనాడులో తన సినిమాకు ఎదురైన పరిస్ధితిని వెళ్లగక్కారు ఈ వివరాల్లోకి వెళితే..
ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కిరణ్.. షార్ట్ ఫిలింస్ తీసుకుంటూ హీరోగా ఎదిగాడు. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమంటపం, సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సినదాణ్ణి, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ తదితర చిత్రాలతో తన కంటూ పేరు తెచ్చుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ క. సుజీత్, సందీప్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు, మంచి మౌత్ టాక్‌తో ఈ సినిమా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన క సినిమాకు గాను కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాడు. రెండో రోజు కూడా ఇదే జోరును కొనసాగిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.40 కోట్ల గ్రాస్.. రూ.4.61 కోట్ల షేర్‌తో కిరణ్ అబ్బరం దుమ్మురేపాడు. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 10.80 కోట్ల గ్రాస్.. రూ.6.06 కోట్ల షేర్ రాబట్టాడు.
సినిమా హిట్ కావడంతో క చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాకు ప్రీమియర్స్ సంఖ్య పెంచామని చెప్పారు. తమిళనాడులోనూ షోలు వేయమని చెన్నై నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తమిళంలో వీలు లేకపోతే తెలుగులోనైనా షోలు వేయాలని అడుగుతున్నారని కిరణ్ అబ్బవరం చెప్పారు. ప్రేక్షకుల విజ్ఞప్తిని మన్నించి దీనిపై ప్రయత్నాలు చేస్తున్నామని.. కనీసం ఐదు షోలు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ స్పీచ్‌పై మాట్లాడుతూ.. తన తల్లి, తాను పడ్డ కష్టం గుర్తొచ్చి ఆ రోజు ఆలా మాట్లాడినట్లు వెల్లడించారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. నేను పడిన బాధను వివరించే ప్రయత్నం చేశానని కిరణ్ పేర్కొన్నారు. నవంబర్ 8న మలయాళంలో క మూవీని రిలీజ్ చేస్తున్నామని.. త్వరలోనే క 2ని అనౌన్స్ చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











