For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను మీకు బాగా కావాల్సినవాడిని అంటోన్న కిరణ్: ఒకే స్క్రీన్‌పై బాలయ్య, పవన్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు హీరోగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా గ్రాండ్ ఎంట్రీని అందుకుంటున్నారు. అలా టాలీవుడ్‌లో హైలైట్ అయిన కుర్రాళ్లలో రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన ప్రియాంక సింగ్: వామ్మో మరీ ఇంత దారుణంగానా!

  'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమా సక్సెస్‌తో మాంచి జోష్‌లో ఉన్న కిరణ్ అబ్బవరం ఈ ఏడాది ఆరంభంలో 'సెబాస్టియన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా మాత్రం అతడికి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇటీవలే కిరణ్ 'సమ్మతమే' అనే సినిమాను చేశాడు. గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం డీసెంట్‌గానే కలెక్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

  Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini Teaser Released

  హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అందుకు అనుగుణంగానే చిత్రీకరణను స్పీడుగా చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంధించిన టాకీ పార్టును చాలా వరకూ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

  ప్యాంట్ లేకుండా సరయు రచ్చ: అదొక్కటి అడ్డు లేకపోతే అంతే సంగతులు

  కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఇందులో అతడిని ట్యాక్సీ డ్రైవర్‌గా పరిచయం చేశారు. అలాగే, ప్రేమకథ లేని కుర్రాడిగా కిరణ్ నటించాడు. అతడికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మామగా నటించాడు. వీళ్లిద్దరూ కలిసి కనిపించిన తీరు నవ్వులు పూయిస్తోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ తండ్రి ఇంటికి వెళ్లిన సమయంలో బాబా 'నేను బాలయ్య బాబు.. వీడు పవన్ కల్యాణ్' అని చెప్పే డైలాగ్ చాలా ఫన్నీగా అనిపించింది. మొత్తానికి ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతోంది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీలో సంజన ఆనంద్, సోను ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ సమర్పణలో, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

  English summary
  Kiran Abbavaram Now Doing a Film Nenu Meeku Baaga Kavalsinavaadini Under Sridhar Gadhe Direction. Now This Movie Teaser Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X