twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిరణ్ అబ్బవారం హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. మార్చి 4న రాబోతున్న ‘సెబాస్టియన్‌ పిసి524’

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా మంచి గుర్తింపు అందుకుంటున్న హీరోలలో కిరణ్ అబ్బవరం టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. చాలా కష్టపడి విభిన్నమైన కథలతో ఆకట్టుకుంటున్న ఈ యువ హీరో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను కూడా అందుకుంటున్నాడు మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే ఆ సినిమా ఇచ్చిన విజయంతో ప్రేక్షకులకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెండవ చిత్రం కళ్యాణ మండపం కూడా స్థాయిలో విజయం ఎంతో అవసరం లేదు పోటీగా మిగతా సినిమాలో ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. కిరణ్ అబ్బవరం కు బాక్సాఫీస్ ని కూడా పెరిగిపోయి అవకాశాలు వస్తున్నాయి.

    అయితే మాస్ క్లాస్ ఆడియెన్స్ ను సమానంగా సంతృప్తి పరుస్తున్న కిరణ్ ఈసారి డిఫరెంట్ సినిమాతో మరో వర్గం ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధం అయ్యాడు. తాజాగా మార్చి 4న 'సెబాస్టియన్‌ పిసి 524'తో మరో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి కిరణ్ అబ్బవరం సిద్ధమవుతున్నాడు. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్ లో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మరికొందరు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.

    Kiran abbavaram Sebastian P.C. 524 movie release date details

    ఇక ఈ సినిమా 'సెబాస్టియన్‌ పిసి524'. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. ఇక సినిమా గురించి నిర్మాతలు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. 'రాజావారు రాణిగారు', 'ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం' సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న కిరణ్‌ అబ్బవరపుకు 'సెబాస్టియన్‌ పిసి524' ఖచ్చితంగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంటారు అని అన్నారు. ఇక ఈ సినిమాకు జిబ్రాన్‌ అందించిన సంగీతం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుందని. ప్రధానంగా "హెలి"అనే పాట భారీ స్థాయిలో క్రేజ్ అందుకుందని ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని తాము అస్సలు ఊహించలేని అన్నారు.

    ఇక రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో బ్సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన అన్ని పాటలకు కూడా ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోందని ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అందరికి నచ్చుతుందని చెప్పారు. హీరో రేచీకటి నేపథ్యంలో బాధపడుతూ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగంతో ఎలా మ్యానేజ్ చేస్తాడు అనేది ఈ సినిమాలో మేయిన్ పాయింట్ అని.. ముఖ్యంగా నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం ఆకట్టుకుంది అని అన్నారు. ఇక ఫైనల్ గా మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పారు .

    కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడుఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైన్‌: చవన్‌ ప్రసాద్‌, స్టిల్స్‌: కుందన్‌ - శివ, సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌, కాస్ట్యూమ్స్‌: రెబెకా - అయేషా మరియమ్‌, ఫైట్స్‌: అంజి మాస్టర్‌, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎల్‌. మదన్‌, సమర్పణ: ఎలైట్‌ ఎంటర్టైన్మెంట్స్‌, నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌, సంగీతం: జిబ్రాన్‌, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు, కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.

    English summary
    Kiran abbavaram Sebastian P.C. 524 movie release date details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X