SR Kalyanamandapam ఓటీటీలోకి వచ్చేది అప్పుడే: ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, మంచి టాక్‌ను అందుకున్నా ప్రతికూల పరిస్థితుల కారణంగా కొన్ని చిత్రాలు కలెక్షన్లను రాబట్టడంలో విఫలం అయ్యాయి. ఇలాంటి తరుణంలో ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ 'ఎస్‌ఆర్ కల్యాణమండపం'. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇంతకీ ఇది ఎప్పుడు.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే!

తండ్రి సెంటిమెంట్‌తో ‘కల్యాణమండపం'
కిరణ్ అబ్బవరం హీరోగా, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం'. శ్రీధర్ గాదె తీసిన ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

భారీ అంచనాలు... షాకింగ్‌గా బిజినెస్
స్టార్ హీరో కాకున్నా.. పేరున్న దర్శకుడు లేకున్నా కిరణ్ అబ్బవరం నటించిన 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అంతేకాదు, వీటి వల్ల యూత్‌కు చేరువ కావడంతో పాటు ఈ మూవీ పేరు మారుమ్రోగిపోయింది.
దీంతో దీనికి బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 4.55 కోట్ల వ్యాపారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ గ్రాండ్‌గానే విడుదలైంది.

అలాంటి టాక్‌తో.. అంత లాభాలతో
'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాకు ఆదిలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రతికూల పరిస్థితులు ఉండడంతో ఈ చిత్రం మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది కలెక్షన్లను భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా మొదటి రోజు రూ. 1.40 కోట్లు వసూలయ్యాయి.
అలా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కంప్లీట్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ స్టేటస్‌ను అందుకుంది. అప్పటి నుంచి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రాబడుతూ సత్తా చాటింది. దీంతో చిత్ర నిర్మాతలకు దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే లాభాలు కూడా దక్కాయి.

ఓటీటీ స్ట్రీమింగ్‌పై వచ్చేసిన క్లారటీ
థియేటర్లలో సత్తా చాటిన 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.20 కోట్లు వరకూ కలెక్ట్ చేసింది. ఇక, ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి ఈ రెండు మూడు రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇది పలానా ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కాబోతుందన్న ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'ఎస్ఆర్ కల్యాణమండపం' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని తెలుగు సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితం వెల్లడించారు.

ఆ ఓటీటీ సంస్థలోనే.. ఎప్పుడంటే
'ఎస్ఆర్ కల్యాణమండపం' ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ పోస్టర్‌ను విడుదల చేసిన ఆహా సంస్థ.. 'తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం' అతి త్వరలో మీ ఆహాలో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!' అంటూ పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం.. ఇది ఆగస్టు చివరి వారంలో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











