Happy Birthday Chiranjeevi: చిరంజీవికి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్.. బర్త్‌డే కానుకగా మరొకటి
మెగాస్టార్ చిరంజీవి కొంత కాలంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరెన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో ఇప్పటికే పలు చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అదే సమయంలో మిగిలిన వాటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా వస్తున్నాయి. ఇక, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఆయన నటించబోయే చిత్రాలకు సంబంధించిన ఎన్నో విషయాలు రివీల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది.

ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తున్నారు
రీఎంట్రీలో జెట్ స్పీడుతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. దీనితో పాటు మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్' అనే సినిమాను కూడా ప్రకటించారు. అలాగే, మెహర్ రమేష్, బాబీతోనూ ప్రాజెక్టులు చేయనున్నారు.
భోళా శంకర్.. పరిచయం చేసిన మహేశ్
తమిళంలో అజిత్ కుమార్ హీరోగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' మూవీని చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. దీనికి 'భోళా శంకర్' అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు.

ఈ నేపథ్యంతో సినిమా... మరో సర్‌ప్రైజ్
మాస్ డైరెక్టర్‌గా పేరొందిన శిరుత్తి శివ తెరకెక్కించిన 'వేదాళం' మూవీలో అజిత్ హీరోగా నటించగా.. అతడి చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక, ఇప్పుడు 'భోళా శంకర్' మూవీ కూడా అదే పంథాలో రూపొందిస్తున్నారు. కాకపోతే తమిళంలో కంటే ఎక్కువ సెంటిమెంట్ పార్ట్‌ను జోడించబోతున్నారని తెలుస్తోంది.

ట్రయల్ షూట్ పూర్తి.. చిరు ప్రశంసలు
దర్శకుడు మెహర్ రమేశ్ గత ఏడాది కోల్‌కతా వెళ్లి మరీ 'భోళా శంకర్' కోసం కొన్ని శాంపిల్ షాట్స్‌ను తెరకెక్కించినట్లు తాజాగా తెలిసింది. దసరా సమయంలో అక్కడ కుంభమేళా జరుగుతుంది. అందుకే అక్కడ ఈ సన్నివేశాలు చిత్రీకరించాడట. ఇందుకోసం ఈ దర్శకుడు ఏకంగా రూ. 30 లక్షలు కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చిరంజీవికి బాగా నచ్చాయని కూడా తెలుస్తోంది.

చిరంజీవికి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్
'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, నేడు చిరంజీవి పుట్టినరోజుతో పాటు రాఖీ పండుగ కూడా ఉండడంతో.. 'భోళా శంకర్'లో చిరంజీవి సోదరి పాత్రను రివీల్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ నటిస్తుందని చెప్పారు. తాజాగా యూనిట్ ఓ పోస్టర్ వదలగా.. అందులో కీర్తి.. చిరుకు రాఖీ కడుతోంది.
Recommended Video

మహా మెగా మూవీ అంటూ నిర్మాతలు
తాజాగా 'భోళా శంకర్' పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన కీర్తి సురేష్ 'పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి సార్. మీతో నటించాలన్న నా కల ఇలా నేరవేరబోతుంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అంటూ ట్వీట్ చేసింది. అలాగే, నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ 'కీర్తి సురేష్ ఎంట్రీతో ఇది మహా మెగా మూవీ అయింది' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











