‘నన్ను పడక గదిలోకి రమ్మంటే.. వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే’

సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి అవకాశాల పేరుతో వాళ్లను లోబరుచుకునే క్యాస్టింగ్ కౌచ్ భూతానికి ఎంతో మంది ప్రతిభావంతులు బలైపోయారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు కామాంధుల చేతికి చిక్కి జీవితాలను నాశనం చేసుకున్నవారు ఎందరో. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఈ లిస్ట్ తీస్తే ఎంతోమంది కనిపిస్తారు. తాజాగా టాలీవుడ్‌లో లేడీ కమెడియన్‌, గీతా సింగ్ తన జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కితకితలుతో పాపులర్
దివంగత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు సినిమాలో హీరో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటించారు గీతా సింగ్. భారీ పర్సనాలిటీతో కనిపిస్తూనే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. లావుగా ఉన్న ఆడవాళ్లకి కూడా మనసు ఉంటుందని భర్తకు బుద్ధి వచ్చేలా చేసే మహిళగా గీతా సింగ్ అద్భుతంగా నటించారు. నిజానికి ఈ సినిమాకు ముందే జై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గీతా సింగ్. ఆ తర్వాత ఎవడిగోల వాడిది, అల్లరి పిడుగు, ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, మళ్లీ మళ్లీ, సీమటపాకాయ్, ధూల్, సరైనోడు ఇలా హిట్ చిత్రాలలో నటించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 70కి పైగా సినిమాలలో నటించారు.

Kithakithalu fame Geeta Singh opens up about nasty Casting Couch in Film Industry

తెరకు దూరంగా గీతా సింగ్
అయితే గత కొన్నేళ్లుగా గీతా సింగ్ తెరపై కనిపించడం మానేశారు. దానికి తోడు తెలుగు తెరపై కామెడీ సినిమాలు తీసే దర్శకులు తగ్గడంతో కమెడియన్లకు అవకాశాలు కూడా తగ్గాయి. మధ్యలో గీతా సింగ్‌కు ఆఫర్లు వస్తున్నా పెద్దగా అవి సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చారు. సినిమాలలో నటించకపోయినప్పటికీ గీతా సింగ్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేవారు. సినిమాల సంగతులు, ఇతర వ్యక్తిగత వివరాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు.

జబర్దస్త్ వర్ష షోకు గీతా సింగ్
గీతా సింగ్ వివాహం చేసుకోలేదు.. తన సోదరుడిని కొడుకును దత్తత తీసుకుని అతనిని అల్లారుముద్దుగా పెంచుకుంది. అలాంటి కొడుకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గీతా సింగ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుంటున్న గీతా సింగ్ ఇటీవల తన కుమారుడి వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్న గీతా సింగ్ తన కెరీర్, జీవితం ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందిని కూడా వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Take a Poll

గుద్ది చంపేస్తా
మిమ్మల్ని ఎవరైనా కమిట్‌మెంట్ అడిగారా? అని వర్ష ప్రశ్నించగా.. నన్ను చూసి ఎవడైనా కమిట్‌మెంట్ అడుగుతాడా? అని సెటైర్లు వేసింది గీతా సింగ్. వాడు సూసైడ్ చేసుకున్నట్లేనని నవ్వించారు. నన్ను ఇంత వరకు ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదని, అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేదన్నారు. కమిట్‌మెంట్ అడిగిన వాడిని ఒక గుద్ధు గుద్దితే చాలు వాడి ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అని గీతా సింగ్ తేల్చేశారు. నేనే కాడు.. ఎవడైనా అమ్మాయిని కమిట్‌మెంట్ అడిగితే వాడిని చంపేయాలని అమ్మాయలకు గీతా సింగ్ పిలుపునిచ్చారు. ఒక కుటుంబాన్ని గౌరవించని వాడైతేనే అలాంటిది అడుగుతాడని, వాడికి అమ్మ, అక్క, చెల్లె, భార్య ఉంటారు కదా.. వాళ్లని కూడా ఎవరైనా ఇలా అడిగితే వాడు ఊరుకుంటాడా అని ఆమె ప్రశ్నించారు. మనం తేలికగా దొరికితే.. వాళ్లంతా ప్రెస్టేజేస్ ప్లేస్‌లో ఉన్నట్లా అని గీతా సింగ్ నిలదీశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: geetha singh jabardasth varsha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X