Upasana konidela: అమ్మానాన్నలతో క్లింకారాకు అలాంటి అనుభవం.. తొలిసారి అంటూ ఉపాసన పోస్ట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప మొహం తెలియకపోయినా... ఈమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. మెగా ఫ్యామిలీ వారసురాలిగా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈ పాపాయికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఈమె కోసం ఉపాసన, చెర్రీలు చేస్తున్న పనులు మరింత ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్నాయి. అయితే తాతాగా క్లింకారా అమ్మానాన్నలతో కలిసి.. ఓ స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ను సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఉపాసన పంచుకుంది. అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం.

క్లింకారా పుట్టి 8 నెలలు గడుస్తుండగా.. ఇప్పటికీ ఆమెకు సంబంధించిన ఫొటోలను ఎవరూ షేర్ చేయలేదు. ముఖ్యంగా ఆమెను బయటకు చూపించకుండానే.. విదేశాలకు కూడా తిప్పుతున్నారు. ఏవైనా పోస్టులు పెట్టినా ఆమె మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆమె కోసం స్పెషల్ గా ట్రైబల్స్ ను తీసుకొచ్చి నామకరణం చేయించడం, స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేయడం.. నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తూ కేర్ టేకర్ ను పెట్టడం... ఇలా అన్ని పేపర్లో వచ్చాయి.
అయితే ఇంత కాలంగా క్లింకారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న ఉపాన.. తొలిసారి తన ముద్దుల కూతురు ఫేస్ ను రివీల్ చేశారు. కానీ ఇందులో పూర్తిగా కనిపించట్లేదు. మొహం కనిపించకపోయినా ఓ స్పెషల్ విషయం చెప్పింది ఉపాసన. క్లింకారా.. తొలిసారి అమ్మానాన్నలతో కలిసి ఫస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ చేసిందని.. చెప్పుకొచ్చింది.
అక్కడ దిగిన ఫొటోలను.. ఓ వీడియోగా మలిచి ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. అందులో క్లింకారాను ఎత్తుకున్న రామ్ చరణ్.. అలలతో పాటు పరుగులు పెడుతూ ఎంజాయ్ చేశాడు. ముఖ్యంగా వారితో పాటు వారి పెట్ డాగ్ కూడా అక్కడకు వెళ్లింది. అయితే ఫ్యామిలీతో కలిసి క్లింకారా తొలి సారి వైజాగ్ బీచ్ కు వెళ్లగా.. వైజాగ్ మా హృదయాలను దోచేసింది అంటూ రాసుకొచ్చింది ఉపాసన
ముఖ్యంగా ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేయడాన్ని చూస్తూ.. ఆయన ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. పాప పూర్తి మొహం చూపించమంటూ కింద కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా.. మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. చెర్రీ సరసన ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్ గా చేస్తుండగా.. ఆయన నెక్ట్స్ సినిమా RC16కి కూడా కసరత్తులు ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











