పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. 'కొబ్బరిమట్ట' టీం ఏం చేసిందో చూడండి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 2) ఆయన 48వ పుట్టినరోజు సందర్బంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నాయి ఆయన అభిమాన వర్గాలు. కేవలం సినీ లోకమే గాక రాజకీయ లోకం కూడా పవన్ కళ్యాణ్ ని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో 'కొబ్బరిమట్ట' టీం కాస్త వెరైటీగా స్పందించి వావ్ అనిపించింది. ఇంతకీ 'కొబ్బరిమట్ట' టీం ఏం చేసింది? వివరాల్లోకి పోతే..

పవన్‌కి అండగా.. ప్రతీ క్షణం
సినిమాలు వదిలి జనసేన పార్టీతో పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయకుండా పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ని, ఆయన పార్టీని సపోర్ట్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ప్రతీ క్షణం ఆయనకు అండగా నిలుస్తున్నారు.

పుట్టిన రోజు సందర్బంగా భారీ రేంజ్‌లో..
ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా జనసేన పార్టీకి మద్దతుగా భారీ రేంజ్‌లో విరాళాలు అందిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదే బాటలో ఇటీవలే వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కొబ్బరిమట్ట టీమ్ కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తమ వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్.
సాయి రాజేష్ ట్వీట్.. ఏమన్నారంటే..
మా టీమ్ ఇచ్చిన మాట ప్రకారం నేను, సంపూర్ణేశ్ బాబు, ఉమా మహేశ్.. జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని ట్వీట్ చేశారు ‘కొబ్బరి మట్ట' నిర్మాత సాయి రాజేశ్. జనసేన పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సందీప్ పంచకర్లకు ఈ లక్ష రూపాయల చెక్కును పంపించామని ఆయన తెలిపారు. మా సినిమాను హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు రాజేష్.

బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న పవన్
ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా పారిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అవుతోంది. పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











