యువ తార ఇంట్లో కరోనా కలకలం.. వైరస్ బారిన ఫ్యామిలీ అంతా!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా కోరలు చాచుతోంది. కరోనా విజృంభణ జరుగుతున్న తీరు చూస్తే అందరికీ ఆందోళన కలుగుతోంది. రోజుకు కొన్ని వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కరోనా అందర్నీ పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా సెలెబ్రిటీల ఇంట్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. వారి ఇంట్లో పని చేసే సిబ్బందికో లేదా స్టార్స్‌కో కరోనా సోకుతూనే ఉంది. ప్రస్తుతం ఓ నటి కుటుంబంలోని అందరికీ కరోనా సోకిందనే వార్తలు హల్చల్ చేస్తోంది.

సెలెబ్రిటీలకు కరోనా..
కరోనా సామాన్య జనాలను ఎలా పీడిస్తోందో.. సెలెబ్రిటీలను అంతే స్థాయిలో వెంటాడుతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా మాత్రం వదలడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ సెలెబ్రిటీల్లో కరోనా వ్యాప్తి చెందుతూ ఉండగా.. తాజాగా ఓ బెంగాల్ నటి ఫ్యామిలీకి కరోనా సోకిందని తెలుస్తోంది.

బెంగాలీ నటికి కరోనా..
బెంగాలీ నటి కోయల్ మల్లిక్‌కి కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు అంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ప్రకటించింది. దీంతో అందరిలోనూ గుబులు రేపింది. ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడంతో ఇండస్ట్రీలోనూ ఆందోళన కలుగుతోంది.

ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్‌లో..
బెంగాలీ నటి కోయల్ మల్లిక్ తనకు కరోనా సోకినట్టు ప్రకటించింది. మా అమ్మ, నాన్న , భర్త అందరికీ కరోనా సోకింది.. మేమంతా స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నామని ప్రకటించింది. ఘోరే, భైరే, చాయా చో చోబి వంటి చిత్రాలతో ఫేమస్ అయింది. చివరగా.. బోనీ అనే చిత్రంతో పలకరించింది.
Recommended Video

అమితాబ్ కుటుంబంలో..
ప్రస్తుతం అమితాబ్ కుటుంబంలోనూ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ రాగా.. మిగతా వారి ఫలితం ఇంకా రావాల్సి ఉంది. ఇలా సెలెబ్రిటీలకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.


Click it and Unblock the Notifications











