ప్రియురాలితో OG నటుడి బ్రేకప్? హృదయాన్ని ముక్కలు చేసిందంటూ ఎమోషనల్ పోస్ట్
చిత్ర పరిశ్రమలో నటీనటుల ఎఫైర్లు, ప్రేమాయణాలు, బ్రేకప్స్, పెళ్లిళ్లు, విడాకులు కామన్. నిత్యం ఏదో ఒక ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఇలాంటి వార్తల్లో ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న దళపతి విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకుల నోటీసు అందుకున్నారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన ఓ నటుడు తన ప్రియురాలితో బ్రేకప్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
చెన్నైకి చెందిన అర్జున్ ఎంతో కష్టపడి, ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుని నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ మంచి స్థితిలో ఉన్నప్పటికీ సినిమాలపై పిచ్చితో ఉద్యోగం వదిలేసి అవకాశాల కోసం ప్రయత్నించాడు. అలాగే నటుడికి ఉండాల్సిన అన్ని రకాల అర్హతలను సంపాదించాడు. ఏకంగా 40 కేజీల బరువుతగ్గి తన పట్టుదల ఎలాంటిదో నిరూపించారు. తొలుత రేడియో జాకీగా ఛాన్స్ అందుకున్న అర్జున్ తన వాయిస్‌తో శ్రోతలను అలరించారు. ఆ వాయిస్ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టడంతో పాటు సినీరంగం వైపు బాటను పరిచింది.

అయితే ఇదే వాయిస్ కారణంగా తాను ఎన్నో అవకాశాలను కోల్పోయానని, ఎన్నో తిరస్కరణలు సైతం ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అర్జున్ దాస్. వాయిస్ బాలేదని చాలామంది తనకు ఆఫర్స్ ఇవ్వలేదని ఆయన పలుమార్లు వాపోయారు. ఈ దశలో 2012లో విడుదలైన పేరుమాన్ మూవీతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అర్జున్ దాస్. అయితే ఆయకే బ్రేక్ రావడానికి కూడా ఎంతో కష్టపడ్డారు. దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత లోకేష్ కనగరాజ్ రూపంలో ఆయనను అదృష్టం తలుపు తట్టింది. లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్, మాస్టర్ మూవీలలో అర్జున్ నటనకు ప్రశంసలు దక్కాయి.
విక్రమ్ సినిమాలో వాయిస్ ఆయనను ఎక్కడికో తీసుకెళ్లింది. ఏ వాయిస్ కారణంగా అవకాశాలు కోల్పోయాడో.. అదే గొంతుతో గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ దాస్. తమిళంతో పాటు తెలుగులో పలు చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కృష్ణుడి పాత్రకు గాత్రదానం చేశారు. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలో నటించడంతో పాటు ఈ మూవీ గ్లింప్స్‌కు కూడా ఆయనే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే అనే చిన్న డైలాగ్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు అర్జున్ దాస్. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా తన మార్క్ చూపిస్తున్నారు ఈ యువ నటుడు.
కాగా.. అర్జున్ దాస్ గత కొంతకాలంగా ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. దీనిపై మీడియాలోనూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అర్జున్ దాస్ పెట్టిన ఓ ఇన్‌స్టా స్టోరీ కలకలం రేపింది. బ్రేకప్ అయినట్లుగా అర్ధాన్నిచ్చేలా ఆ పోస్ట్ ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, వారు మీ హృదయాన్ని ముక్కలు చేసినప్పుడు, మీరు ఎలా ముందుకు సాగగలరు? అని రాసుకొచ్చాడు. దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించాడు అర్జున్ దాస్. దాంతో ప్రియురాలితో ఈ నటుడు బ్రేకప్ చెప్పేశాడా? అంటూ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కువమంది అర్జున్ దాస్ తన బ్రేకప్ గురించే చెబుతున్నాడని భావిస్తుండగా.. కొందరు మాత్రం మరేదో విషయాన్ని బయటపెట్టాడని కామెంట్స్ పెడుతున్నారు. అయితే విజయ్- త్రిషల గురించి మీడియాలో వస్తున్న కథనాలు.. వారిద్దరి ప్రవర్తన నేపథ్యంలోనే అర్జున్ దాస్ ఈ పోస్ట్‌లు పెట్టాడని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ అంటే అర్జున్ దాస్‌కి చాలా ఇష్టం. తన అభిమాన నటుడితో కలిసి మాస్టర్ సినిమాలో కలిసి నటించాడు. ఇంకొందరు మాత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్‌పై అర్జున్ దాస్ ఇలా హింట్ ఇస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఈ రూమర్స్‌కి చెక్ పడాలంటే అర్జున్ దాస్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications


















