twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతుల సమస్యను పరిష్కరించండి.. కేంద్రానికి హీరో కార్తీ బహిరంగ లేఖ

    |

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీని రైతులు దిగ్భందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ హక్కుల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు కదం తొక్కుతూ ఉన్న సంగతి తెలిసిందే.

    ఇదిలా ఉండగా, రైతుల ఆందోళనపై స్పందించాలంటూ తమిళ నటుడు కార్తీ కేంద్రానికి లేఖ రాశారు. రైతుల హక్కులను కాపాడే విధంగా కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని, రైతుల ఆవేదనను సర్కారు పట్టించుకోవాలని లేఖలో కోరారు.

    రైతులు చేపట్టిన ఆందోళనపై మోదీ ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలి. రైతుల ఆందోళనలో పెద్ద ఎత్తున్న మహిళలు, వృద్ధులు పాల్గొంటున్నారు. ఓ చరిత్రాత్మక ఆందోళనకు దారి తీసేలా కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి అని కార్తీ తన లేఖలో పేర్కొన్నారు.

    Kollywood actor Karthi open letter to the Modi government over farmers protest

    ఇటీవల ఢిల్లీలో రైతుల ఆందోళనపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఓ వృద్ధురాలి ఫోటోను ట్వీట్ చేస్తూ.. షహీన్ బాగ్ అల్లర్లలో పాలుపంచుకొన్న మహిళ అంటూ కామెంట్ చేసింది. అయితే ఆమె పంజాబ్‌కు చెందిన మహిళ మహిందర్ కౌర్ అంటూ పలువురు ట్యాగ్ చేయడంతో గందరగోళం నెలకొన్నది.

    English summary
    Kollywood Actor Karthi has urged the Centre to listen to the farmers' plea and guarantee their farming rights. He wrote an open letter to the government, has requested the Centre to listen and act on farmers' protest immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X