పూరి జగన్నాథ్ లాగే కోట్లు మోసపోయిన తమిళ స్టార్.. అప్పుల ఊబీలో కోలీవుడ్ హీరో!

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు విజయ్ ఆంటోనీ. సోషల్ అంశాలతో ప్రయోగాత్మకంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేశారు. ఈయన సినిమాలకు తమిళులే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అవ్వడం విశేషం. మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోనీ కెరీర్ లో మంచి సక్సెస్ ను చూశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అలాంటి ఆయన ప్రస్తుతం అప్పుల ఊబీలో కూరుకుపోయారని, అందుకు కారణం కొందరి చేతిలో మోసపోవడమే అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అన్నింటా విజయ్ ఆంటోనీ మార్క్..
తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ ఆంటోనీ అన్ని క్రాఫ్ట్స్ పైనా పట్టు సాధించారు.మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, నటుడిగా, ఫిల్మ్ ఎడిటర్ గా, లిరిసిస్ట్ గా, ఆడియో ఇంజనీర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ గా పని చేసి తన మార్క్ చూపించారు. మరోవైపు దర్శకుడిగానూ పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించారు. తొలుత ఆయన కెరీయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర క్రాఫ్ట్స్ పైనా ఆసక్తి చూపించడం విశేషం.

Kollywood Actor Vijay Antony Lossed Crores

అప్పుల్లో విజయ్ ఆంటోనీ..
విజయ్ ఆంటోనీ, తమిళ చలనచిత్ర పరిశ్రమలో నిరంతరం సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు మాట్లాడారు. అతను హీరోగా 12వ చిత్రం మార్గన్, జూన్ 27, 2025న విడుదలైంది. అయితే ఈ చిత్రంలో అతను నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారని, అలాగే వడ్డీలకు అప్పులు తీసుకొని తన రాబోయే చిత్రాలను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

దీంతో విజయ్ ఆంటోనీ ఆర్థిక పరిస్థితి బాలేదని ఇప్పటికే మార్గన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆయన సినిమాల వచ్చినా ప్రాఫిట్స్ ను అప్పలు తీర్చడానికే వినియోగిస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగైతే, ఇతర నటులతో సినిమాలు నిర్మించాలని భావిస్తున్నానని, తన సినిమాను ప్రోత్సహించాలని కోరారు.

విజయ్ ఆంటోనీ అప్పులకు కారణం..
ఒకప్పుడు వరుస హిట్స్ ను మినిమ్స్ ప్రాఫిట్స్ తో విజయ్ ఆంటోనీ సినిమాలు చేశారు. అయితే అతని సినిమాల విషయంలో తన ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్లు జోక్యం చేసుకోవడం భారీగా నష్టాలు వచ్చాయి. వాళ్ల వల్ల విజయ్ ఆంటోనీ కోట్లల్లోనే డబ్బులు కోల్పోయారని ప్రచారం జరుగుతుంది. ఇక టాలీవుడ్ లో కొందరిని నమ్మి పూరీ జగన్నాథ్ రూ.100 కోట్లకు పైగా డబ్బులు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ ఆంటోనీ పరిస్థితి కూడా అలానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X