40 ఏళ్ళ వయసులో మూడో పెళ్లికి సిద్దమైన దేవి హీరోయిన్.. ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా..

సినిమా ప్రపంచంలో కొందరు నటీమణులు తీసుకునే నిర్ణయాలు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారాలతో అప్పుడప్పుడు అభిమానులకు షాకిస్తారు. ఇక ప్రస్తుతం దేవి హీరోయిన్ వనితా విజయకుమార్ కూడా మూడు పెళ్లిళ్లతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె సినిమాలకంటే కూడా వివాధాలతోనే ఎక్కువగా ఫోకస్ అవుతూ వచ్చింది.

దేవి సినిమాతో..

దేవి సినిమాతో..

నటి వనితా విజయకుమార్ అంటే తమిళ్ ఆడియెన్స్ కి బాగా తెలిసిన పేరు. ఈమె సీనియర్ నటుడు విజయకుమార్ పెద్ద కూతురు. ఇక తెలుగు ఆడియెన్స్ కి మాత్రం ఆమె ఒకే ఒక్క సినిమాతో బాగా దగ్గరైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాలో వనితా మెయిన్ లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఎందుకో అనిత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.

బిగ్ బాస్ ద్వారా విమర్శలు..

బిగ్ బాస్ ద్వారా విమర్శలు..

ఇక తమిళ్ లో సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వనితా గత ఏడాది తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా మెరిసింది. వివాదాలతో అమ్మడు షోకు మంచి రేటింగ్ అయితే తెచ్చుకుంది గాని విమర్శల నుంచి తప్పించుకోలేక పోయింది. ఇక ఇప్పటికే రెండు సార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న వనిత ఇప్పుడు మరోసారి పెళ్లి పీఠలు ఎక్కబోతోంది.

మూడో పెళ్లికి రెడీ..

మూడో పెళ్లికి రెడీ..

బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా పెళ్లి చేసుకోబోతోంది. మొన్నటివరకు ఆమె పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక నేటితో అనితా విజయకుమార్ అఫీషియల్ గా వెడ్డింగ్ కార్డ్ ని కూడా మీడియాకు ముందుకు తీసుకువచ్చింది.

ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా..

ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా..

వనితా విజయకుమార్ మొదట నటుడు ఆకాష్ ని 2000వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకుంది. వారికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. 2005లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆనంద్ జయ రాజన్ అనే వ్యాపారవేత్తని 2007లో వివాహం చేసుకున్న అనితా కొన్నాళ్లకు మళ్ళీ అతనితో విడిపోయింది. వీరికి ఒక కూతురు ఉంది.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
 పెళ్లి డేట్ కూడా ఫిక్స్..

పెళ్లి డేట్ కూడా ఫిక్స్..

ఆ మధ్య ఆనంద్ పై వనితా పోలీస్ కేసు కూడా నమోదు చేసింది. ఇక నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న సమయంలో ఆమె మరో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. జూన్ 27వ తేదీన చెన్నైలో వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ వివాహం జరగనుంది. గత కొన్నాళ్ల నుంచి పీటర్ తో వనితా రిలేషన్ లో ఉంది. డేటింగ్ అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X