twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ బ్రాండ్‌తో తమిళ్ హీరో.. మరో నితిన్ అయ్యేలా ఉన్నాడు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ లో హిట్టు పడింది అంటే చాలు చిన్న హీరోలు కూడా తెలుగులో అదృష్టాన్ని పరిక్షించుకోవాలని అనుకుంటారు. అయితే చాలా రోజుల తరువాత ఒక యువ తమిళ్ హీరో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఈ హీరో తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Remo gets U certificate, gearing up for Nov 25th release | Sivakarthikeyan | Telugu Filmibeat
    నాని తరహాలో చాలానే కష్టపడ్డాడు

    నాని తరహాలో చాలానే కష్టపడ్డాడు

    ఆ హీరో మరెవరో కాదు. శివ కార్తికేయన్. ఈ యువ హీరో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. ఒక సాదారణ మిమిక్రి ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. ఒక విధంగా మన దగ్గర నాని ఏ విధంగా స్టార్ డమ్ అందుకున్నాడో తమిళ్ లో కార్తికేయన్ కూడా ఆ విధంగా కష్టపడి క్రేజ్ అందుకున్నాడు

    పవన్ కళ్యాణ్ పై అభిమానం

    పవన్ కళ్యాణ్ పై అభిమానం


    అసలు విషయంలోకి వస్తే శివ కార్తికేయన్ కి పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం ఉందని తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమా నుంచే అతను పవన్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ అభిమానం గట్టిగానే పెంచేసుకున్నాడట. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించాడు. ఇక పవన్ కూడా శివ కార్తికేయన్ కు కూడా మంచి రిప్లై ఇచ్చాడు.

    ఆ సినిమాలో స్పెషల్ రోల్

    ఆ సినిమాలో స్పెషల్ రోల్

    ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న పిరియాడిక్ సినిమాలో శివ కార్తికేయన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా టాక్ అయితే వస్తోంది. అతి ఎంతవరకు నిజమో తెలియదు గాని శివ కార్తికేయన్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చాలా సార్లు మాట్లాడాడు.

    మరో నితిన్ అయ్యేలా ఉన్నాడు

    మరో నితిన్ అయ్యేలా ఉన్నాడు


    ఎవరు ఏమనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ పై అభిమానం తగ్గదని నితిన్ చాలా సార్లు చెప్పాడు. ఇక శివ కార్తికేయన్ కూడా అదే తరహాలో పవర్ స్టార్ అభిమానులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. త్వరలో ఈ హీరో డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసేలా ఉన్నాడని టాక్ వస్తోంది. మరి ఆ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Pawan Kalyan’s upcoming film under Krish’s direction has been constantly making headlines for the last couple of months regarding its leading lady. After Pragya Jaiswal and Keerthy Suresh, Bollywood actress Jacqueline Fernandez was said to be roped in as the leading lady opposite the Powerstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X