పెళ్లయిన స్టార్‌తో శృతి హాసన్‌కి ఎఫైర్.. బ్రేకప్‌కి కారణం ఏంటో తెలుసా?
ఆడ, మగ మధ్య ఆకర్షణ సర్వసాధారణం. ఇక చిత్ర పరిశ్రమలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. రకరకాల వ్యక్తులు .. రంగుల ప్రపంచంలాంటి ఇండస్ట్రీలో ఎన్నో జంటల మధ్య ప్రేమలు పుట్టాయి. కానీ వీటిలో పెళ్లి వరకు వెళ్లిన కథలు కొన్నే. ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఎంతోమంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడిచింది. కోలీవుడ్ స్టార్స్ ధనుష్ - శృతీ హాసన్ మధ్య కూడా ఎఫైర్ ఉందంటూ మీడియా కోడై కూసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకున్నారు శృతీహాసన్. విలక్షణ నటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన శృతీ హాసన్.. హీరోయిన్‌గా సక్సెస్ కావడానికి మాత్రం చాలా కష్టపడింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శృతిపై ఐరన్ లెగ్ ముద్రపడింది. అనగనగా ఓ ధీరుడు, సెవెన్త్ సెన్స్ , ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అయితే 2012లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఆమె కెరీర్‌ని మార్చేసింది.

ఆ వెంటనే మహేశ్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్‌తో రేసుగుర్రం వంటి వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంది. నటిగానే కాకుండా సింగర్‌గా, కంపోజర్‌గా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. కెరీర్‌లో సక్సెస్ కొట్టిన శృతీ హాసన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం బోల్డన్నీ కాంట్రవర్సీలు. పలువురితో ఆమె ప్రేమాయణం సాగించింది.. ఇందులో భారతీయులతో పాటు విదేశీయులూ ఉన్నారు. మైఖేల్ కోర్స్ లే.. శృతీ హాసన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అప్పట్లో కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శృతీహాసన్.. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు.. ఏ సబ్జెక్ట్‌పై అయినా బోల్డ్‌గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది శృతీ హాసన్. అప్పట్లో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, కానీ నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహానికి ముందే తల్లిని అవుతానని కుండబద్ధలు కొట్టింది. మైఖేల్ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఈ భామ డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం పెట్టినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయినట్లుగా తెలుస్తోంది.

వీరే కాదు.. శృతి ఎఫైర్ల లిస్టులో పలువురు స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టార్ సింగర్ సుచిత్ర వీరి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 మూవీ టైంలో శృతి హాసన్- ధనుష్ ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేశారని ఆమె చెప్పింది. అయితే అప్పటికే ధనుష్‌కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ భార్య. ఈ విషయం తెలిసి శృతికి ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. అలా ఈ జంట విడిపోయిందని, లేదంటే అప్పట్లోనే పెళ్లి చేసుకుని ఉండేవారనే కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు.. 3 మూవీ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు శృతి - ధనుష్ జంటగా నటించలేదు. అయితే ఇప్పటికీ ధనుష్‌కి శృతి అంటే ప్రేమ తగ్గలేదని కోలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











