మాజీ ప్రియుడితో నయనతార రొమాంటిక్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా గత దశాబ్ద కాలం నుంచి కొనసాగుతున్న హాట్ బ్యూటీ నయనతార. నయన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా నయన్ కెరీర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవల నయనతార తన మాజీ ప్రియుడితో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.

 లేడి సూపర్ స్టార్..

లేడి సూపర్ స్టార్..

నయనతార జీవితంలో సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆమె ఎక్కువ ఆనందపడింది లేదు. అలాగని సినిమాల వల్ల బాధపడింది లేదు. కానీ వ్యక్తిగత జీవితంలో వరుసగా ప్రేమలో విఫలం కావడం ఆమెకు కోలుకోలేని దెబ్బకొట్టాయి. కొన్నాళ్లవరకు మనోవేదనకు లోనైన నయన్ మొత్తానికి విగ్నేష్ శివన్ తో లవ్ ట్రాక్ ని నడుపుతున్న విషయం తెలిసిందే.

మాజీ ప్రియుడితో..

మాజీ ప్రియుడితో..

ఇక చాలా రోజుల తరువాత నయనతార తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కొన్నాళ్లపాటు ప్రభుదేవాతో ఆమె రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పెళ్లికి కూడా సిద్ధమైంది అని వార్తలు వస్తున్న తరుణంలో ఆమె లవ్ కి బ్రేకప్ చెప్పినట్లు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుదేవాతో ఆమె సినిమా చేయడానికి రెడీగా ఉందనే కామెంట్స్ వచ్చాయి.

Recommended Video

Nayanthara & Prabhudeva Pair Up For A Movie ?
క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ఫైనల్ గా తమిళ్ స్టార్ ప్రొడ్యూసర్ కె.గణేష్ ఈ కాంబినేషన్ లో ఒక సినిమాను నిర్మించనున్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం నయనతారతో ఆ నిర్మాత ఒక డెవోషనల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రభుదేవ నయన్ కాంబోపై రూమర్స్ వస్తుండడంతో ఆయన అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చారు.

మరో సినిమా..

మరో సినిమా..

నయనతారతో ఒక సినిమా చేస్తున్నట్లు చెబుతూ.. కుదిరితే మరొక ప్రాజెక్ట్ కూడా సెట్టయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన గణేష్ అసలు ప్రభుదేవా నయనతార కాంబినేషన్ లో సినిమాని నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ రూమర్స్ కి తెరపడినట్లయ్యింది. మరి భవిష్యత్తులో అయినా నయన్ తన మాజీ ప్రియుడితో అవకాశం వస్తే.. నటిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X