రాజమౌళికి కొమురం భీమ్ మనవడి హెచ్చరిక.. RRR సినిమాను అడ్డుకుంటాం అంటూ..

బిగ్గెస్ట్ పాన్ ఇండియ మూవీగా రూపొందుతున్న RRRపై కూడా వివాదాలలు మొదలయ్యాయి. చారిత్రాత్మక కథలను ఎంచుకున్నప్పుడు కథలపై ఆరోపణలు అభ్యంతరాలు రావడం కామన్ అయినప్పటికీ ఈ సారి RRR విషయంలో వివాదం ఎక్కువయ్యేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కొమురం బీమ్ వంశానికి చెందిన కొందరు టీజర్ లుక్ పై అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే. ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ పవర్ఫుల్ టీజర్

ఎన్టీఆర్ పవర్ఫుల్ టీజర్

RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ ఇటీవల విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింధి. కొన్ని కాపీ ఆరోపణలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ లుక్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉందని అర్ధమయ్యింది.

 ఆ పాత్రను ముస్లింగా చూపించడంతో..

ఆ పాత్రను ముస్లింగా చూపించడంతో..

ఒక్కసారిగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే టీజర్ లుక్ విడుదల చేశారో లేదో వివాధాలు అభ్యంతరాలు కూడా మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ పాత్రను ముస్లింగా చిత్రీకరించడంపై వివాదం కొనసాగుతోంది. కొమురం భీమ్ మనవడు సోన్ రావు, ఎస్.ఎస్.రాజమౌళి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

 కొమురం బీమ్ మనవడు ఏమన్నారంటే..

కొమురం బీమ్ మనవడు ఏమన్నారంటే..

సోన్ రావ్ మాట్లాడుతూ "మా హీరో గురించి పూర్తి సమాచారం కోసం దర్శకుడు, రచయితలు మమ్మల్ని సంప్రదించినట్లయితే, మేము వారికి సహాయం చేసేవాళ్ళం. భీమ్ గిరిజనుల భూమి, నీరు, ఇతర వనరుల కోసం పోరాడారు. అయితే అలాంటి వ్యక్తిని మైనారిటీ సమాజ సభ్యునిగా సూచించడం వక్రీకరించడమే అవుతుంది. భీమ్ మారువేషంలో ముస్లింలా కనిపించాడని చెప్పడానికి చారిత్రక రికార్డులేమి లేవు.

రాజమౌళికి హెచ్చరిక

రాజమౌళికి హెచ్చరిక

ఈ సినిమాలో ఒక దేవుడిగా ఆరాధించే హీరోని తప్పుగా చూపించడం ఆదివాసులను బాధపెట్టడమే అవుతుంది. ముస్లిం గెటప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము రాజమౌలిని అభ్యర్థిస్తున్నాము" అని ఆ వీడియోలో సోన్ రావ్ వివరణ ఇచ్చారు. అదే విధంగా ఆ లుక్ ని ఉపసంహరించుకోకపోతే తాము ఖచ్చితంగా సినిమాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని కూడా వారు హెచ్చరిక జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

#RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
రాజమౌళికి ఈ విషయం ముందే తెలుసు

రాజమౌళికి ఈ విషయం ముందే తెలుసు

అయితే ఈ సినిమాను స్టార్ట్ చేసే సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రాజమౌళి వివాదాల గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. ఏ సినిమాకైనా వివాదాలు రావడం సహజమని ఏ చరిత్రతో సంబంధం లేని బాహుబలికి కూడా అభ్యంతరాలు వచ్చాయని అయితే అలాంటి వాటికి భయపడి ఒక మంచి కథను జనాలకు చెప్పకపోతే దానికి అర్థం ఉండదని అన్నారు. మరి ఇప్పుడు కొమురం భీమ్ మనవడు చేసిన కామెంట్స్ పై జక్కన్న ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X