అంజలితో నా బంధం అదే.. హీరోయిన్‌తో రిలేషన్‌పై నిర్మాత క్లారిటీ!
తెలుగు సినిమా దగ్గర తెలుగు హీరోయిన్స్ అవకాశాలు ఒకింత తక్కువే ఉంటాయి అనేది ఇప్పుడు మాట కాదు ఎప్పుడు నుంచో ఉన్న మాటే.. దీనితో ఇక్కడ నుంచి అవ్వడానికి తెలుగు హీరోయిన్స్ అయినా తమిళ సినిమాలో అవకాశం కోసం వెళ్లి అక్కడే ఎక్కువగా సినిమాలు చేసే హీరోయిన్స్ కూడా లేకపోలేరు. అలాంటి వారిలో రీసెంట్ గానే వచ్చిన భారీ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కూడా ఒకామె..
మరి ఐశ్వర్య రాజేష్ తో పాటుగా ఇదే సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో మరో తెలుగు నటి తమిళ్ సెటిల్డ్ అయినటువంటి అంజలి నుంచి రెండు సినిమాలు సౌత్ లో వచ్చాయి. కాగా తెలుగులో గేమ్ ఛేంజర్ తమిళ్ లో మద గజ రాజా అనే రెండు సినిమాలు అంజలి నుంచి వచ్చాయి. కాగా గేమ్ ఛేంజర్ లో ఆమెకి మంచి మార్కులు వచ్చాయి కానీ సినిమా ఆడలేదు.

ఇక తమిళ్ సినిమా అయితే క్రింజ్ టాక్ తో కూడా తమిళ నాట మంచి వసూళ్లు సాధించింది. కాగా ఇపుడు ఇదే అంజలిపై కొన్ని ఆసక్తికర అంశాలు బయటకి వచ్చాయి. అంజలి ఇతర హీరోయిన్స్ లా కాకుండా చాలా చలాకిగా కనిపిస్తుంది. ఇలా తెలుగులో ఎన్నో సినిమాలు కూడా చేసింది. కానీ ఆమె స్టార్ హీరోయిన్ లా మాత్రం మారలేకపోయింది.
కాగా అంజలిపై మరీ ఇతర హీరోయిన్స్ లా అఫైర్స్ లాంటివి మాటలు కూడా చాలా తక్కువ కానీ టాలీవుడ్ కి చెందిన ప్రముఖ రచయిత, అలాగే నిర్మాత కూడా అయినటువంటి కోనా వెంకట్ తో మాత్రం రిలేషన్ అంటూ పలు పుకార్లు ఉన్నాయి. మెయిన్ గా అంజలికి సోలోగా "గీతాంజలి" అనే హారర్ సినిమా చేయడం దానితో పాటుగా దాని సీక్వెల్ కూడా చేయడం ఇవి సహా పలు సమయాల్లో అంజలికి కోనా వెంకట్ సపోర్ట్ నిలవడంతో ఇదంతా మరో రకంగా ప్రోజెక్ట్ అయ్యింది.
కాగా దీనిపై కోనా వెంకట్ ఫైనల్ గా నోరు విప్పినట్టు తెలుస్తుంది. తమపై ఉన్న అన్ని రూమర్స్ కి చెక్ పెట్టి అంజలి నాకు చెల్లెలు, ఒక కూతురు లేదా ఒక మంచి ఫ్రెండ్ ఇలా ఎలా అయినా పిలమన్నా పిలుస్తాను ఆమె అంటే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉందని అసలు విషయం రివీల్ చేశారు.

ఆమె పర్శనల్ లైఫ్ చాలా తక్కువమందికే తెలుసనీ ఆమె చిన్ననాటి జీవితం అంత సజావుగా సాగలేదని అవి తెలిసినవాడిగా ఆమె అంటే ఒకింత సపోర్ట్ గా నిలుస్తాను అని తాను తమ బంధం ఏంటి అనేది రివీల్ చేశారు. దీనితో కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. కాగా కోనా వెంకట్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ కి కథలు, మాటలు అందించిన సంగతి తెలిసిందే.
మెయిన్ గా దర్శకుడు శ్రీను వైట్లతో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వీరికి ఉన్నాయి. ఇక అంజలి తెలుగు సహా తమిళ్ సినిమాల్లోనే బిజీగా ఉంది. కాగా రీసెంట్ గానే ఆమె నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











