50 నిద్రమాత్రలతో సూసైడ్ అటెంప్ట్.. ఆ అమ్మాయి వల్లే..

సినీ పరిశ్రమలో సక్సెస్ లు మాత్రమే కనిపిస్తాయి. కానీ, వాటి వెనుక ఉన్న పోరాటాలు, బాధలు చాలా మందికి తెలియవు. తొలి ఓటమితో తీవ్ర నిరాశకు గురైన ఓ ప్రముఖ సినీ రచయిత, నిర్మాత.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. ఆర్థికంగా కూడా అన్ని దారులూ మూసుకుపోయినట్లుగా అనిపించిన ఆ సమయంలో, తాను చనిపోయాలని నిర్ణయించుకున్నాడట. ఈ సమయంలో 50 నిద్రమాత్రలతో సూసైడ్ చేసుకోవాలని బీచ్ కు వెళ్లారంట. కానీ, అక్కడ జీవితంతో పోరాడుతున్న ఓ చిన్నారి పరిస్థితి చూసి అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఆ క్షణమే అతనికి కొత్త ఆశ నింపి, తిరిగి జీవితాన్ని ప్రారంభించాలని భావించారట. ఇంతకీ ఆ సినీ రచయిత ఎవరు? అసలేం జరిగిందంటే?

ఆ సినీ రచయిత ఎవరో కాదు.. టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్.. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న ఓ భావోద్వేగ ఘటనను బయటపెట్టారు. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే అదే సమయంలో ఎదురైన ఒక చిన్న సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కోన వెంకట్ వెల్లడించారు.

Kona Venkat Suicide Attempt Story How a Girl Saved His Life at Chennai Beach

కోన వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. 1997లో చెన్నైలో ఉన్న సమయంలో ఆయన తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట. జీవితంలో ఏ దారూ కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్ననీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 50 నిద్రమాత్రలు కొనుగోలు చేసి, చివరిసారిగా తన వద్ద ఉన్న డబ్బులతో ఒక వాటర్ బాటిల్ తీసుకుని చెన్నై బీచ్‌కు వెళ్లారట. అక్కడే జీవితానికి ముగింపు పలకాలని భావించారట. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన ఆయన ఆలోచనను పూర్తిగా మార్చేసిందట.

బీచ్ వద్ద ఒక చిన్నారి బెలూన్లు అమ్ముకుంటూ కనిపించింది. ఆ అమ్మాయికి చేతులు, కాళ్లు లేకపోయినా తన తమ్ముడు తోసే బండిపై కూర్చుని జీవనోపాధి కోసం కష్టపడుతోందట. ఆ దృశ్యం కోన వెంకట్‌ను లోలోపల కుదిపేసిందట. 'రేపు ఏమవుతుందో తెలియని ఆ చిన్నారి కూడా జీవితం కోసం పోరాడుతుంటే.. నేను ఎందుకు బతకలేను?' అనే ఆలోచన తనలో కలిగిందని ఆయన తెలిపారు.

ఆ క్షణమే తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి జీవితాన్ని స్వీకరించానని కోన వెంకట్ అన్నారు. తన ప్రాణాలను కాపాడటానికి దేవుడే ఆ చిన్నారిని తన ముందుకు పంపాడని భావిస్తున్నానని చెప్పారు. ఆ సంఘటన తర్వాత జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని, సినిమాల్లో తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించానని వెల్లడించారు.

తర్వాత కాలంలో కోన వెంకట్ రచయితగా, నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే తన జీవితాన్ని మార్చిన ఆ చిన్నారిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేదని తెలిపారు. ఆమెను మరోసారి చూడాలని అనుకుని అనేకసార్లు చెన్నై బీచ్‌కు వెళ్లి వెతికినా, మళ్లీ ఎక్కడా కనిపించలేదని భావోద్వేగంగా చెప్పారు.

ఇటీవల విడుదలైన 'బ్యాండ్ మేళం' సినిమా థ్యాంక్యూ మీట్‌లో ఈ విషయాలను పంచుకున్న కోన వెంకట్, తన జీవితంలో జరిగిన ఈ మలుపు ఎప్పటికీ మరచిపోలేనిదని అన్నారు. 'బ్యాండ్ మేళం' సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించగా, సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించగా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ అందుకుంది.

Read more about: tollywood kona venkat band melam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X