Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వెంకీ మామ నుంచి తప్పుకున్న కోన వెంకట్!
వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. వెంకటేష్ వరుసగా మల్టీస్టార్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. శనివారం రోజు ఉగాది సందర్భంగా వెంకీ మామ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది.
ఫస్ట్ లుక్లో వెంకటేష్, నాగ చైతన్య కూల్ లుక్లో కనిపిస్తున్నారు. రైతులు, జవాన్ల ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ ని కూడా అలాగే డిజైన్ చేశారు. వెంకటేష్ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జైలవకుశ చిత్రం తర్వాత దర్శకుడు బాబీ రూపొందిస్తున్న చిత్రం ఇదే.
సురేష్ బాబు, కోన వెంకట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కోన వెంకట్ వెంకీ మామ చిత్రం నుంచి తప్పుకున్నారు. వెంకీ మామ చిత్రం ఆగిపోయిందంటూ ప్రచారం జరిగిన సమయంలో కోన వెంకట్ ఆ వార్తలని ఖండించారు. వెంకీ మామ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకుని వెళతామని తెలిపారు. కానీ అనుకోని కారణాల వల్ల కోన వెంకట్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఫస్ట్ లుక్ లో కూడా కోనవెంకట్ పేరు లేదు. కోన వెంకట్ అనుష్క నటిస్తున్న సైలెన్స్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.