KONDA POLAM First look: పంజా వైష్ణవ్ తేజ్ మరో కొత్త ప్రయోగం.. శత్రువులపై సరికొత్త వేట

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాస్త అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇక మెగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఏ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో రిస్క్ చేసి మరి సినిమా చేశాడు. అలాంటి ప్రయోగాత్మకమైన కథ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా మొదటికే మోసం వస్తుంది.

అయినప్పటికి ఏమాత్రం భయపడకుండా మొదటి అడుగులోనే మంచి టాలెంటెడ్ హీరో అని నిరూపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత హీరో పై అంచనాలు గట్టిగానే పెరిగాయి. తరువాత రాబోయే సినిమాలపై కూడా ఎంతో కొంత డిఫరెంట్ గా ఉంటాయని ఓ వర్గం ప్రేక్షకులు నమ్మకం అయితే పెట్టుకున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో చాలా రోజుల క్రితం పూర్తి చేసిన వైష్ణవ్ రెండవ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేశారు.

ప్రేక్షకుల అంచనాలకు మించి

ప్రేక్షకుల అంచనాలకు మించి

ఎలాంటి సినిమా చేసినా కూడా ఎంతో కొంత కొత్త గా ఉండాలని నేటి తరం యువ హీరోలు ఆలోచిస్తున్నారు కథలో రిస్క్ ఉంటేనే తప్ప సినిమా చేయడం లేదు. ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక మొదటి సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్ మరో అవకాశాన్ని అందుకున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో చేసిన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే ఇటీవల కాలంలో చాలానే వైరల్ అయ్యాయి.

శత్రువులను వేటాడేందుకు సిద్ధమైన వైష్ణవ్

మొదట ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు అయితే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ లో కొండ పొలం అని ఫిక్స్ చేసిన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఒక పొలంలో ఉన్న వైష్ణవ్ తేజ్ చేతిలో ఉన్న చిన్నపాటి ఆయుధం శత్రువులను వేటాడేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ఇదివరకే ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.

మనసును హత్తుకునేలా

మనసును హత్తుకునేలా

దర్శకుడు క్రిష్ వీలైనంత వరకు తన సినిమాలతో ప్రేక్షకుల మనసును హత్తుకునేలా చేస్తాడు. ఇక ఎంతో వేగంగా పూర్తి చేసిన ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇక ప్రస్తుతం కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతూ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే దర్శకుడు క్రిష్ కొండపొలంను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

Recommended Video

Hero Raj Tarun Talks About Co-Stars In Orey Bujjiga Movie
విడుదల ఎప్పుడంటే..

విడుదల ఎప్పుడంటే..

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాతో హీరోయిన్ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని కష్టపడుతోంది. దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో కూడా మంచి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఫస్ట్ లుక్ టీజర్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఎలాంటి కథ అయినా సరే ఎమోషనల్ గా టచ్ చేసే క్రిష్ ఈసారి కూడా కొత్త తరహం సందేశాంతో రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X