Konda Movie Trailer అరేయ్ ధర్మారెడ్డిగా.. దయాకర్‌రావుగా.. ఖబర్దార్.. కొండా సురేఖ, వర్మ వార్నింగ్

వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలకుపైగా అధిపత్యం కొనసాగించిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతుల జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా అనే చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. సినిమా ప్రారంభాన్ని ప్రభుత్వ అధికారులు అడ్డుకొనేందుకు ప్రయత్నంచడంతో రాంగోపాల్ వర్మ తనదైన శైలి స్పందించడమే కాకుండా సినిమాను కొండా మురళీ స్వగ్రామం వంచనగిరిలో ప్రారంభించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వివాదంగా మారేటట్లు కనిపిస్తున్నది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం..

హన్మకొండలో ట్రైలర్ రిలీజ్‌కు వర్మ ఆహ్వానం

పలు ఆటంకాలు, సమస్యల మధ్య కొండా చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నది. ఈ క్రమంలో కొండా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రిపబ్లిక్ డేను వేదికగా మలుచుకొన్నారు. అయితే ఈ ట్రైలర్ ఆవిష్కరణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మంత్రి దయాకర్ రావు అడ్డుపడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొండా సురేఖతో కలిసి రాంగోపాల్ వర్మ వీడియో రిలీజ్ చేశారు. కొండా సినిమా ట్రైలర్ లాంచ్ కి , కొండా సినిమా అభిమానులందరు రేపు ఉదయం10.25 కి రాంనగర్ హనుమకొండ లో ని కొండా క్యాంపు ఆఫీస్ కి రాగలరని నా హృదయపూర్వక ఆహ్వానం అంటూ
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

కొండా నివాసంలోకి పోలీసులు

అయితే కొండా సురేఖతో కలిసి వీడియో రిలీజ్ చేయడానికి ముందు రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కొండా సినిమా ట్రైలర్ రిలీజ్‌ను అడ్డుకొనేందుకు కొండా దంపతుల నివాసానికి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి ప్రోద్బలంతో పోలీసులు వచ్చారు అని ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొండా దంపతుల నివాసంలోకి పోలీస్ అధికారి రావడంతో కొండా దంపతులు ఘాటుగా స్పందించారు.

అరేయ్ ధర్మారెడ్డి, దయాకర్ రావుగా

వీడియోలో కొండా సురేఖ మాట్లాడుతూ.. అరేయ్ ధర్మారెడ్డిగా, ఒరేయ్ దయాకర్ రావుగా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు. మీరు ఎన్ని కథలు పడినా, ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా జనవరి 26న రిలీజ్ అవుతున్న కొండా మూవీ ట్రైలర్‌ను ఆపలేరు. ఎందుకంటే కొండా మూవీని ప్రజలు కోరుకొంటున్నారు. ప్రజల కోసం కొండా సినిమాను తీశాం. ప్రజల మధ్య ఉండే నాయకులం మేము. కాబట్టి మీరు ఏం చేసినా గానీ కొండా ట్రైలర్‌ను ఆపలేరు అని కొండా సురేఖ వీడియోలో ఘాటుగా హెచ్చరించారు.

కార్ల్ మార్క్స్ చెప్పినట్టు అంటూ వర్మ

కార్ల్ మార్క్స్ చెప్పినట్టు అంటూ వర్మ

అంతకు ముందు.. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది. పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శాల్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను. కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది.

మా కొండా కథ ఇదే..

మా కొండా కథ ఇదే..

ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో, ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ అని ఆర్జీవి తెలిపారు అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X