twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Konda దంపతుల గెలుపుకు సినిమా తీయనక్కర్లేదు.. రాజకీయ ప్రయోజనాలపై కొండా సుస్మిత షాకింగ్ కామెంట్

    |

    ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించిన రాజకీయ నేతలు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా కొండా అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. జూన్ 23వ తేదీన కొండా చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

    1990 నాటి పరిస్థితులు, నక్సలైట్స్ గురించి

    1990 నాటి పరిస్థితులు, నక్సలైట్స్ గురించి


    కొండా ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్సాన్స్‌ను కూడగట్టుకొన్నది. 1990 నాటి నుంచి జరిగిన వాస్తవ పరిస్థితులను ఆధారంగా చూసుకొని నిర్మించినట్టు ట్రైలర్‌లో వెల్లడించారు. పెత్తందార్ల ఎదురించడానికి వ్యవస్థ మొత్తం తిరగబడుతున్నదని వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఇంటెన్సివ్‌గా కనిపించింది. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్లు, రాజకీయ పార్టీలతో కొండా దంపతుల విభేదాలు.. వాటిని ఎదురించిన తీరు ట్రైలర్‌లో సజీవంగా కనిపించాయి.

    కార్ల్ మార్క్స్‌ను కోట్ చేస్తూ..

    కార్ల్ మార్క్స్‌ను కోట్ చేస్తూ..


    రాం గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. విపరీత పరిస్థితుల నుంచి విపరీతమైన వ్యక్తులు ఉద్బవిస్తారని 180 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ చెప్పిన విషయంతో ట్రైలర్ మరింత ఉద్వేగంగా కనిపించింది. కొండా సురేఖ, మురళి ప్రేమ కథ ఫీల్‌గుడ్‌గా కనిపించింది. కొండా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. 11వేలకుపైగా లైక్స్‌తో సుమారు 4 లక్షలపైగా ఆర్గానిక్ వ్యూస్ రావడం గమనార్హం.

     తెలంగాణ ప్రాంతంలో భావోద్వేగమైన కథ

    తెలంగాణ ప్రాంతంలో భావోద్వేగమైన కథ


    కొండా సినిమా గురించి వర్మ వివరిస్తూ.. తెలంగాణలోని ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఇలాంటి తరహా చిత్రం, నక్సలైట్ నేపథ్యంగా ఇలాంటి సినిమా రావడం కొత్త. ముంబైలో దావూద్ ఇబ్రహీం పుట్టాడు కాబట్టి.. ఆ ప్రాంతం నేపథ్యంగా కథలు ఎలా పుట్టాయో.. కొండా కథ కూడా అలాంటి ఎమోషనల్ షేడ్స్ ఉంటాయి. తెలంగాణలో అమ్మవారికి మద్యం తాగించే అంశం నన్ను చాలా ఆకట్టుకొన్నది అని చెప్పారు.

     రాజకీయ ప్రయోజనాలా?

    రాజకీయ ప్రయోజనాలా?


    కొండా దంపతుల కుమార్తె సుస్మిత మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ సినిమా చూడలేదు. కానీ కొంత రషెస్ చూశాను. తెర మీద మా అమ్మ, నాన్నల కథ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా రాజకీయ ప్రయోజనాలు ఆశించి తీయలేదు. ఒకవేళ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే.. వచ్చే ఏడాది రిలీజ్ చేసేవాళ్లు. మా అమ్మ, నాన్న గెలువాలంటే.. సినిమా చేస్తేనే గెలుస్తారనుకోవడం తప్పు. మా అమ్మ, నాన్న జీవిత కథ.. యువతకు స్పూర్తిగా నిలువాలని ఈ సినిమాను తీశాం అని అన్నారు.

    యూత్‌కు స్పూర్తిగా ఉండేలా

    యూత్‌కు స్పూర్తిగా ఉండేలా


    ప్రస్తుతం యూత్‌కు రాజకీయాలకు పట్టింపు లేదు. సమాజం మీద అవగాహన లేదు. కేవలం మొబైల్ ఫోన్లకు పరిమితం అవుతున్నారు. సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నప్పటికీ స్పందించడం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లోకి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి సినిమా యువతకు మార్గదర్శకంగా ఉంటుందనేది మా అభిప్రాయం. మంచి కథ లభిస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు నిర్మిస్తాం అని కొండా సుస్మిత అన్నారు.

    కొండా సీక్వెల్ గురించి


    కొండా మూవీకి సీక్వెల్‌ గురించి.. కొండా సురేఖ, మురళి జీవితంలో జరిగిన డ్రామాటిక్ అంశాలను తీసుకొని సినిమా తీశాను. కొండా సినిమాలో ఇంకా చాలా అంశాలు మిగిలి ఉన్నాయి. మున్ముందు కొండా సీక్వెల్ గురించి ఏమైనా జరుగొచ్చు. ఇప్పటికిప్పుడు కొండా సీక్వెల్ గురించి ఎలాంటి ఆలోచన లేదు అని సుస్మిత చెప్పారు.

    English summary
    Kondaa movie trailer getting good response in youtube. In this occassion, Konda Susmitha made sensational comments on movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X