రవితేజ సినిమా ఆగిపోలేదు.. వదంతులు నమ్మెద్దు నిర్మాత క్లారిటీ..
హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఓ చిత్రాన్ని సెట్స్‌పై షూటింగ్ కొనసాగిస్తూనే మరోవైపు తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం క్రాక్. ఈ చిత్రం వాస్తవానికి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తన తదుపరి చిత్రాన్ని రాక్షసుడు ఫేం రమేష్ వర్మతో చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాత. అయితే ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఆగిపోయిందనే వార్త ఇటీవల మీడియాలో వైరల్ అయింది. రమేష్ వర్మతో రవితేజ సినిమా ఆగిపోయిందనే వార్తలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ స్పందించారు.
రవితేజతో రూపొందించనున్న సినిమా ఆగిపోలేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనులు కాస్త నెమ్మదించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. వాటిని నమ్మవద్దు అంటూ నిర్మాత సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తివేయగానే.. అలాగే ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇవ్వగానే సినిమాను గ్రాండ్‌గా ప్రారంభిస్తాం. రాక్షసుడు' తర్వాత ఒక చక్కని స్క్రిప్టుతో చక్కని సినిమాను చేసేందుకు రమేశ్ వర్మ పనిచేస్తున్నారు. రమేశ్ వర్మకు రవితేజ సహకారం బ్రహ్మండంగా ఉంది. ఈ సినిమా విషయంలో వస్తున్న వదంతులను నమ్మెద్దు అని సత్యనారాయణ పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో, ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో నిర్మాణం కానున్న ఈ సినిమాకు పేరుపొందిన టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తమిళ చిత్రం రాక్షసుడు ఆధారంగా తెలుగులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రూపొందించిన రాక్షసుడు చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. విద్యా వ్యాపారంలో విశేష అనుభవం గడించిన వీరు.. ప్రస్తుతం సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











