ఆ హీరోను పడేయడం చాలా ఈజీ.. అతడితో రిలేషన్ అదే.. నిహారిక
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోవడంతో తన చూపు నిర్మాణం వైపు పెట్టి సక్సెస్ కొట్టారు. తక్కువ బడ్జెట్‌తో , మంచి కంటెంట్‌తో ఆమె తీసిన సినిమాలను ప్రజలు ఆదరిస్తుండంతో నిహారిక మరింత ముందుకెళ్తున్నారు. అయితే నిహారిక పర్సనల్ లైఫ్ గురించి నేటికీ సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. ఆమె జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? లేక ఇలాగే ఉండిపోతారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు.
తొలుత బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక కొణిదెల ఆ తర్వాత ఒక మనసు చిత్రం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలలో నటించింది. అలాగే పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. కానీ అవేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు నిహారిక. 2020 డిసెంబర్‌లో వీరి విహహాం ఘనంగా జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కొన్నాళ్లకే విడిపోయారు.

వ్యక్తిగత జీవితంలో బాగా డిస్ట్రబ్ అయిన నిహారిక కొన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నారు. తిరిగి సినిమాలపై ఫోకస్ చేసిన ఆమె నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి ముద్దపప్పు అవకాయ్. నాన్న కూచి, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ తదితర వెబ్ సిరీస్‌లు నిర్మించారు. ఇక గతేడాది నిహారిక నిర్మాణ సారథ్యంలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు సంచలన విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.
అయితే టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో కొన్ని విడిపోయిన నటీనటులు మరొకరిని పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. తెలుగులో నాగచైతన్య సమంతతో విడిపోయాక శోభిత ధూళిపాళను ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారంటూ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా మెగా మేనల్లుడు సాయిథరమ్ తేజ్‌ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిహారిక గట్టిగా క్లాస్ పీకారు. సాయి తనకు బావ మాత్రమేనని.. ఇలాంటి పిచ్చి ఆలోచనలు తమకు లేవని కుండబద్ధలు కొట్టింది.
పంజా వైష్ణవ్ తేజ్‌ను ఆమె పెళ్లాడబోతున్నట్లుగా పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్‌ల పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం అప్పట్లో ఇటలీ వెళ్లగా.. నిహారిక - వైష్ణవ్‌ల జంట వైరల్ అయ్యింది. వీరిద్దరూ కలిసి డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఇక వీరిద్దరిని ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ , కొట్టుకుంటూ కనిపిస్తారు. దాంతో నిహారిక - వైష్ణవ్ తేజ్ జంట బాగుంటుందని, పెళ్లి చేసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక కొణిదెల కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్రాళ్లందరీలో క్రేజీ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. బన్నీ అని చెబుతుంది నిహారిక. ఆయన హైపర్ యాక్టివ్ అని, ఎనర్జీ వేరే లెవల్ అని తెలిపింది. ఇక ఎవరినీ బుట్టలో పడేయడం ఈజీ అని యాంకర్ అడగ్గా.. మరో మాట లేకుండా వైష్ణవ్ తేజ్ పేరు చెబుతుంది నిహారిక. ఏం చెప్పినా నమ్మేస్తాడని, నాకు వాడు టెడ్డీ బేర్ లాంటోడని చెప్పి నవ్వులు పూయించింది . మొత్తంగా వైష్ణవ్‌తో తను ఎలా ఉంటుందో ఒక్క ముక్కలో చెప్పేసింది నిహారిక. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











