For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిహారిక పెళ్లి బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆ ఖర్చుల బారమంతా ఆ హీరో పైనే..

  |

  పెళ్లి చేయడానికి ప్లాన్ ఎంత వేసుకున్నా కూడా బడ్జెట్ అనేది కంట్రోల్ లో ఉండదని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే మ్యారేజ్ బ్యూరోలకు ఒక ప్యాకేజ్ ఇస్తే చాలు అన్ని పనులు వాళ్లే చూసుకుంటారు అనేది నేటి తరం వారి ఆలోచన. పెద్ద పెద్ద సెలబ్రెటీలు అందరు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంటారు. ఇక కోవిడ్ ఎఫెక్ట్ వలన ప్రయివేటుగానే పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇక నీహారిక పెళ్లి కూడా అలానే జరగబోతోంది.

  ఎంగేజ్మెంట్ తో ఒక్కసారిగా..

  ఎంగేజ్మెంట్ తో ఒక్కసారిగా..

  చైతన్య, నిహారిక ఎంగేజ్మెంట్ తో ఒక్కసారిగా జనాలను ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే నిశ్చితార్థం అయ్యిందో అప్పటి నుంచి కూడా వారి పెళ్లికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ డిసెంబర్ 9న రాజస్థాన్‌లో పెళ్లి జరగనుంది.

  ఆ ప్యాలెస్ లో ఇంతకుముందు వారి పెళ్లిళ్లు..

  ఆ ప్యాలెస్ లో ఇంతకుముందు వారి పెళ్లిళ్లు..

  ఉదయపూర్‌లోని ప్రసిద్ధ ఉదైలాస్ ప్యాలెస్ లో గ్రాండ్ గా మెగా ఫ్యామిలీ సమక్షంలో పెళ్లి జరగనుంది. ఈ ప్యాలెస్‌ను ఒబెరాయ్ గ్రూప్ నిర్వహిస్తుంది. డెస్టినేషన్ వివాహాలకు బాగా ప్రాచుర్యం పొందిన ఈ ప్యాలెస్ లోనే రాజమౌళి కుమారుడి కార్తికేయ వివాహంతో పాటు వెంకటేష్ కుమార్తె వివాహం కూడా ఇక్కడే జరిగింది.

  పెళ్లి బడ్జెట్ ఎంతంటే..?

  పెళ్లి బడ్జెట్ ఎంతంటే..?

  ఇక పెళ్లి బడ్జెట్ విషయానికి వస్తే కొణిదెల ఫ్యామిలీ దగ్గరి బంధువులు 70 మందికి పైగా పెళ్లి వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు పెళ్లికి ముందు క్వారంటైన్ లోనే ఉండాలని అనుకుంటున్నారట. ఇక పెళ్లికి 7కోట్ల పైగానే ఖర్చు అవుతోందట. ప్యాలెస్ కు ఒక స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

  బారమంతా వరుణ్ తేజ్ పైనే..

  బారమంతా వరుణ్ తేజ్ పైనే..

  ఇక ఖర్చు మొత్తం వరుణ్ తేజ్ పైనే పడుతోందట. ఒక్క గానొక్క చెల్లి పెళ్లి తన చేతుల మీదుగా జరగాలని తండ్రిపై భారం పడకుండా పెళ్లి ఖర్చును తనపైనే వేసుకున్నాడట. హోటల్ సెలక్షన్ నుంచి అప్పగింతల వరకు అలాగే పెళ్లి అనంతరం జరిగే కార్యక్రమాలన్నిటి ఒక బడ్జెట్ అయితే రెడీ చేసుకున్నట్లు తాజ్ వస్తోంది.

  షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన వరుణ్

  షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన వరుణ్

  ఇప్పటికే షూటింగ్ లకు ఎండ్ కార్డ్ పెట్టిన వరుణ్ తేజ్ చెల్లి పెళ్లి ఎండ్ అయ్యే వరకు వేరే పనులు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. గత నెల షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి పెళ్లి కోసం వాయిదా వేసుకోక తప్పలేదు. ఇటీవల వైష్ణవ్ తేజ్ కలిసి రాజస్థాన్ వెళ్లిన వరుణ్ ప్యాలెస్ వారితో డీల్ సెట్ చేసుకొని వచ్చినట్లు సమాచారం. చూస్తుంటే వరుణ్ తేజ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా నిర్వహించేలా ఉన్నాడని అనిపిస్తోంది.

  పెళ్లి తరువాత టాలీవుడ్ సెలబ్రెటీల కోసం

  పెళ్లి తరువాత టాలీవుడ్ సెలబ్రెటీల కోసం

  ఇక పెళ్లికి టాలీవుడ్ సెలబ్రెటీలు పెద్దగా హాజరు కాకపోవచ్చు. కేవలం మెగా ఫ్యామిలీ దగ్గరి బంధువులు సన్నిహితులు మాత్రమే వస్తారట. అందుకే పెళ్లి అనంతరం టాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ గా రిసెప్షన్ ని నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ప్లాన్ రెడీ అయ్యింది. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి 10రోజుల ముందే రాజస్థాన్ వెళ్లనున్నట్లు సమాచారం.

  English summary
  Shocking rumours on niharika acting career after wedding, With the statement made by Nagababu, there have been many news stories about niharika marriage. Rumors of the Mega Daughter wedding are currently being heard in Tollywood. Around the same time she left another special photo .. without Confusion. There are comments from netizens that there is another solid hero coming into the mega family
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X