Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఆచార్య’లో చరణ్ పాత్రపై కొరటాల కీలక నిర్ణయం: వీలైనంత త్వరగా తీసేయాలని చూస్తున్నాడట
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో 'ఆచార్య' ఒకటి. దీనికి కారణం చిరంజీవి.. రామ్ చరణ్ కలయికలో ఇది మెగా మల్టీస్టారర్‌గా రాబోతుండడమే. తండ్రి కొడుకులు నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైనా.. అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మరోసారి షూటింగ్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కొరటాల అదిరిపోయే ప్లాన్ వేశాడని తెలిసింది.
'ఆచార్య' మూవీ షూటింగ్ మరో 14 రోజులు జరిగితే పూర్తవుతుందట. ఇంతలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండడంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఇక, ఈ మూవీ షూటింగ్ పున: ప్రారంభం అయిన వెంటనే.. ముందుగా రామ్ చరణ్ చేయాల్సిన భాగాన్నే చిత్రీకరిస్తాడట కొరటాల. వీలైనంత త్వరగా అతడి పార్ట్‌ను పూర్తి చేసి.. రిలీవ్ చేయాలని భావిస్తున్నాడట. దీనికి కారణం అతడు RRR మూవీ షూటింగ్లో పాల్గొనాల్సి ఉండడమేనని తెలుస్తోంది. ఇక, బ్యాలెన్స్ ఉన్న భాగంలో రామ్ చరణ్‌కు ఓ ఫైట్‌తో పాటు కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
భారీతనంతో రాబోతున్న 'ఆచార్య'లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, పాట, టీజర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.