twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరూ మారండి: బీఆర్ అంబేద్కర్ గురించి కొరటాల శివ కామెంట్!

    |

    భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబేద్కర్ గురించి కొరటాల శివ చేసిన ట్వీట్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

    'ఫాదర్ ఆఫ్ అవర్ కాన్‌స్టిట్యూషన్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మాదిరిగా మంచి హ్యూమనిస్టులుగా మారాల్సిన అవసరం ఉంది' అని శివ ట్వీట్ చేశారు.

    కొరటాల శివ చేసిన ట్వీట్ మీద నెటిజన్లు స్పందింస్తూ... ఎంతో ముఖ్యమైన రోజును మీరు గుర్తు చేశారు. అందుకే మిమ్మల్ని అందరూ బాధ్యతగల దర్శకుడు అంటారు. మీ సినిమాల్లో డైలాగులు కూడా చాలా బాధ్యతగా ఉంటాయి. ఆ డైలాగుల కోసమైనా మళ్లీ మళ్లీ మీ సినిమాలు చూస్తుంటామమని అభిమనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    Koratala Shiva

    సినిమాల విషయానికొస్తే... కొరటాల శివ గతేడాది 'భరత్ అనే నేను' సినిమా ద్వారా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. జూన్లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

    ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' షూటింగులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో.... కొరటాల శివ చేయాల్సిన సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తోంది.

    English summary
    "Remembering the father of our Indian constitution Dr.baba saheb ambedkar on his birth anniversary. Let’s all strive to be a good humanist like him." Koratala Shiva tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X