ప్రతి ఒక్కరికి కొట్టినట్లు చెబుతారట.. అల్లు అర్జున్, కొరటాల కాంబోపై మరో క్రేజీ అప్డేట్
ఒక కొత్త కాంబినేషన్ లో సినిమా వస్తోంది అన్నప్పుడే అభిమానుల్లో అంచనాల డోస్ అమాంతంగా అకాశాన్ని దాటేస్తాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కొరటాల శివ, అల్లు అర్జున్ కలిసి వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పై కేవలం ఒక ఎనౌన్స్మెంట్ మాత్రమే వచ్చింది. దర్శకుడు కొరటాల పూర్తి కథను కూడా సిద్ధం చేశాడట. కానీ కాన్సెప్ట్, జానర్ ఏది అనే దానిపై చిన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటికే అనేక రకాల రూమర్స్ తో కాభిమానులు కొన్ని నిజమని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

కొరటాల టార్గెట్ ..రెండు సినిమాలు
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సగానికి చేరుకున్న సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ లోపు మిగతా షూటింగ్ కూడా ఎండ్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఆ సినిమా విడుదల కాకముందే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు. అందుకు కారణం గత ఏడెనిమిది నెలల నుంచి ఖాళీగా ఉండడంతో వచ్చే ఏడాది రెండు సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది.

మరిన్ని పాన్ ఇండియా సినిమాలు
అసలు మ్యాటర్ లోకి వస్తే కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు లాక్ డౌన్ లోనే ఎనౌన్స్ చేశాడు. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. బన్నీ కూడా పూర్తిగా పుష్ప సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా తప్పకుండా మరో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఆ సినిమా తరువాత బన్నీ వీలైనంత వరకు మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెడతాడాని అర్ధమవుతోంది.

పాన్ ఇండియా తరహాలోనే..
ఇక దర్శకుడు కొరటాల శివతో చేయబోయే సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగానే డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు అలాంటి ప్రయోగాలు చేయని కొరటాల మిగతా భాషల ఆడియెన్స్ ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనున్నట్లు మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. యువ రాజకీయ నాయకుడిగా బన్నీ సరికొత్తగా కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.
Recommended Video

రాజకీయ నాయకుడిగా బన్నీ
సినిమా ఫస్ట్ హాఫ్ ఒక కాలేజ్ యువకుడు రాజకీయ నాయకుడిగా ఎలా మారతాడు అనే కాన్సెప్ట్ లో నడుస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో రియల్ పాలిటిక్స్ ని తలపించే రేంజ్ లో బన్నీ పెర్ఫెమెన్స్ ఉంటుందని ఫైనల్ గా కొరటాల కొట్టినట్లు ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ ఇస్తాడాని సమాచారం. యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనే పాయింట్ మీదనే సినిమా ఉంటుందని మరోక టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. మరి సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











