ఆచార్య నుంచి సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్: ఆయన చేసిన ప్రామిస్‌పై చిరంజీవి కామెంట్స్ వైరల్
రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే రెండు భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవలే భారీ సెట్‌లో చిత్రీకరణను పున: ప్రారంభించారు. దీంతో ఈ మూవీ టీజర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆచార్య' నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. ఆ వివరాలు మీకోసం!

మెగా మల్టీస్టారర్‌గా మారిన ‘ఆచార్య’
'సైరా: నరసింహారెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఇది మెగా మల్టీస్టారర్ అయిపోయింది.

ఇండియాలోనే మొదటిసారి భారీగా
'ఆచార్య' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు కొరటాల. తన గత సినిమాల మాదిరిగానే ఇందులోనూ సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. దేవాదాయ భూములపై జరిగే అన్యాయాలను ఇందులో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం ఇండియాలోనే తొలిసారి భారీ బడ్జెట్‌తో 'టెంపుల్ టౌన్' సెట్ వేశారు.

అన్నీ ముందే లీక్ చేస్తున్న చిరంజీవి
ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు ముందే లీకైపోతున్నాయి. అది ఎవరి వల్లో కాదు.. మెగాస్టార్ చిరంజీవే పొరపాటున పలు అంశాలను రివీల్ చేసేశారు. ఓ మూవీ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన.. సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్ పెట్టినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇందులో నక్సలైట్‌గా చేస్తున్నానని, చరణ్ కూడా నటిస్తున్నాడని చెప్పారు. అలాగే, టెంపుల్ టౌన్ ఫొటోనూ లీక్ చేశారు.

టీజర్ రిలీజ్ డేట్‌పై పుకార్లు... నిరాశే
భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న 'ఆచార్య'పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి... కొరటాల మధ్య సరదాగా
సినిమాల అప్‌డేట్స్ విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై చిరంజీవి ఫన్సీగా స్పందించారు. ఈ మేరకు 'ఆచార్య' టీజర్ విషయంలో తనకు, కొరటాలకు మధ్య సంభాషణ జరిగిందని ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను విడుదల చేశారు. అందులో టీజర్ విడుదల చేస్తావా? నన్ను లీక్ చేయమంటావా? అని చిరు అన్నట్లు.. దానికి రేపు పది గంటలకు అప్‌డేట్ ఇస్తానని కొరటాల చెప్పినట్లు చూపించారు.
Recommended Video
ఆచార్య సర్‌ప్రైజింగ్ వీడియో.. చిరు అలా
ముందుగా చెప్పినట్లే బుధవారం ఉదయం 10 గంటలకు 'ఆచార్య' టీజర్ అప్‌డేట్ ఇచ్చాడు కొరటాల. ఇందుకోసం ఓ స్పెషల్ మీడియాను విడుదల చేశారాయన. అందులో జనవరి 29 సాయంత్రం 4.05 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని రీట్వీట్ చేసిన చిరంజీవి.. 'ప్రామిస్‌ను నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్' అంటూ తన దర్శకుడు కొరటాల శివకు రిప్లై ఇచ్చారు.


Click it and Unblock the Notifications











