దర్శకుడు కొరటాల శివకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ.. క్రిమినల్ చర్యలకు ఆదేశాలు అమలు!
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమా కథ నాదే అంటూ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దాంతో కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
శ్రీమంతుడు సినిమా సమయంలో రచయిత శరత్ చంద్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వాతి పత్రికలో ప్రచురించిన నా కథను కాపీ చేశారు. ఈ విషయంలో నాకు తగిన న్యాయం చేయాలి అని శరత్ చంద్ర హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు శరత్ చంద్రకు ఊరట కలిగిస్తూ.. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది.

అయితే తనకు వ్యతిరేకంగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో తీర్పు రావడంతో కొరటాల శివ వెంటనే ఎగువ కోర్టుకు అప్పీల్ చేసుకొంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రచయిత శరత్ చంద్రకు సానుకూలంగా తీర్పు వచ్చింది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.
దాంతో నాంపల్లి, హైకోర్టుల్లో తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో దర్శకుడు కొరటాల శివ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీమంతుడు కథను కాపీ చేయలేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం కొరటాల పిటిషన్‌లో తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదు అని తేల్చిసింది.
దాంతో సుప్రీంకోర్టులో కొరటాల శివకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేసిన నిరంజన్ రెడ్డికి తమ పిటిషన్‌ను వెనుక్కి తీసుకొన్నారు. దాంతో నాంపల్లి, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమినల్ చర్యలను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కొరటాల శివ ఎలాంటి శిక్షను ఎదుర్కోబోతున్నాడనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











