Devara 3: దేవర 3 మూవీపై తెల్చేసిన కొరటాల.. డైలమాలో ఎన్టీఆర్

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా మార్కెట్ దగ్గర సీక్వెల్ సినిమాల ట్రెండ్ ఎలా కొనసాగుతుందో చూస్తున్నాం. చిన్న లేదు పెద్ద లేదు దాదాపు అన్ని సినిమాలు కూడా సీక్వెల్స్ ట్రెండ్ లోకి వెళ్లిపోయాయి. జనం వాటిని ఆదరిస్తారో లేదో ఆ ఎగ్జైట్మెంట్ ని అందిస్తామో లేదో అనేది కూడా లేకుండా పలు అనేక సినిమాలు అయితే సీక్వెల్స్ ని ప్రకటించేస్తున్నాయి. ఇలా ఈ పర్వం తెలుగులో ఇంకా మూడు భాగాల వరకు అయితే చేరుకోలేదు.

తమిళ్, హిందీ సినిమాలలో మూడు నాలుగు భాసగాలు కూడా వచ్చినవి ఉన్నాయి కానీ సీక్వెల్స్ అంటే హైప్ తీసుకొచ్చింది మాత్రం మన తెలుగు సినిమానే అని చెప్పాలి. అలా పాన్ ఇండియా మొత్తం సీక్వెల్ సినిమాల కోసం మాట్లాడుకునేలా చేసింది కూడా మన తెలుగు సినిమానే అని చెప్పాలి. ఇక ఈ ఏడాదిలో రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మెన్స్ చిత్రం "పుష్ప 2" అని చెప్పాలి.

koratala siva made interetsing commenst on devara 3 with ntr

కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ఏడాది అనౌన్స్ అయ్యిన భారీ సీక్వెల్ ఏది అంటే అది కల్కి 2898 ఎడి ఇంకా లేటెస్ట్ గా వచ్చిన క్రేజీ చిత్రం "దేవర" కూడా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కే కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది కాగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలకి వచ్చింది.

కాగా ఈ సీక్వెల్ పై కూడా మంచి హైప్ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ దేవర పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని పార్ట్ కి మనం చూసి పది పర్సెంట్ మాత్రమే అయితే పార్ట్ 2 మిగతా 90 పర్సెంట్ లో ఉంటుంది అని దర్శకుడు కొరటాల ప్రామిస్ చేశారు. అలాగే పార్ట్ 2 లో యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని తెలిపారు. కాగా దీనికి కూడా కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుందా అనే మాటపై మాత్రం కొరటాల అసలు విషయాన్ని తేల్చేసారు.

koratala siva made interetsing commenst on devara 3 with ntr

కాగా తమకి అసలు దేవర సినిమాని రెండు భాగాలుగా చెయ్యాలనే ప్లాన్ లేదని కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రెండు భాగాలుగా చేశామని చెప్పారు. ఇది ఎన్టీఆర్ కూడా సీక్వెల్స్ పట్ల అంత ఆసక్తి లేదని తెలిపారు. అలా దేవర కథని కేవలం రెండు భాగాలుగా చెప్తే సరిపోతుంది అని అందుకే రెండు పార్టులతో చేసి ఆపేస్తామని తేల్చేసారు.

సో దేవర నుంచి పార్ట్ 3 అనేది ఉండదు అని ఇంకా పార్ట్ 2 మొదలు కాకుండానే కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పార్ట్ 1 సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్తుండగా ఎన్టీఆర్ కెరీర్ లో దేవర సోలోగా ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి 500 కోట్ల క్లబ్ లో నిలిచేందుకు దూసుకెళ్తుంది.

More from Filmibeat

Read more about: ntr janhvi kapoor devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X