సుకుమార్ బాటలో కొరటాల శివ.. ఆ అమ్మాయి కోసమే?
దర్శకుడిగా ఎదగాలంటే అంత ఈజీ కాదని సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. కష్టానికి తగ్గట్టు అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఒక సినిమా సక్సెల్ అయితే అందరికి వర్తిస్తుంది. అదే విధంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ ప్రభావం అందరి కంటే ఎక్కువగా ఒక దర్శకుడి కెరీర్ మీద పడుతుంది. అసిస్టెంట్ గా ఎంత పెద్ద దర్శకుడి దగ్గర పని చేసినా మొదటి అవకాశం అంత ఈజీగా రాదు.
కొందరు సీనియర్ దర్శకులకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే వారు పడిన కష్టం వేరొకరు పడకుండా అప్పుడప్పుడు సాయం అందిస్తూ ఉంటారు. నేటితరం యంగ్ డైరెక్టర్స్ ని బాగా ఎంకరేజ్ చేసే అతి తక్కువ మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు. కుమారి 21F, దర్శకుడు, అలాగే మరికొన్ని సినిమాలను సొంత ప్రొడక్షన్ లొనే నిర్మించి.. కథలను అందించి.. తన శిష్యులకు దర్శకులు అవ్వడానికి అవకాశం ఇచ్చాడు. ఇక అదే బాటలో ఇప్పుడు తన టీమ్ లో టాలెంట్ ఉన్న యువ దర్శకులకు బూస్ట్ ఇవ్వడానికి కొరటాల అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ ఎప్పటి నుంచో కథలు రాసుకుంటున్నాడు. వాటికి పెద్దగా బడ్జెట్ ఏమి కావని తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుకే సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి తన దగ్గర ఎప్పటి నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఒక అమ్మాయికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఆమె కోసమే కొరటాల ఒక స్పెషల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లొనే.. ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి మరో రెండు నెలల్లో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట. మరి నిర్మాతగా కొరటాల ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











