Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వైష్ణవ్ తేజ్ దర్శకుడికి రుణపడి ఉండాలి.. ఉప్పెన దర్శకుడిని బయటకు వదిలితే.. : కొరటాల పవర్ఫుల్ స్పీచ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు ఉప్పెన సినిమాపైనే ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక శనివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా గ్రాండ్ గా నిర్వహించగా మెగాస్టార్ ముఖ్య అతిథిగా వేడుకకు విచ్చేశారు. ఇక వేడుకలో పాల్గొన్న కొరటాల శివ కూడా తన మాటలతో అందరికి ఆకట్టుకోని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అంధించారు.
ఒక సక్సెస్ మీట్ లా ఉంది
కొరటాల శివ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందే హిట్ అయిపోయింది అనే టాక్ ను కొన్ని సినిమాలే తెచ్చుకుంటాయి. అందులో ఉప్పెన ఒకటి. నేను సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. నిజంగా ఇది ఒక సక్సెస్ మీట్ లా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులు అందరిలో నాకు అది కనిపిస్తోందని అన్నారు.
అతని లాంటి వారు ఇంకా రావాలి
ఇక దర్శకుడు సుకుమార్ శిష్యుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా దర్శకుడు బుచ్చిబాబు తెలుగు చిత్రపరిశ్రమలోనే ఒక మంచి దర్శకుడు అవుతాడని నమ్ముతున్నాను. తప్పకుండా అతని లాంటి దర్శకులు ఇంకా చాలా మంది సుకుమార్ రైటింగ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాని చెప్పారు.
వైష్ణవ్ తేజ్ బుచ్చికి రుణపడి ఉండాలి
నాకు కూడా అవకాశం ఇస్తే సుకుమార్ రైటింగ్స్ లో సినిమా చేస్తాను. సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పనితనం అద్భుతంగా ఉంది. ఉప్పెనకు ఒక విజయాన్ని అందించేశారు. వైష్ణవ్ తేజ్ బుచ్చికి రుణపడి ఉండాలి. మైత్రి వారికి బుచ్చి రుణపడి ఉండాలని చిరంజీవి గారు ముందే చెప్పారు. అంతకంటే గొప్ప మాట మరొకటి లేదు.
చెప్పిన విధానం నాకు చాలా నచ్చేసింది
బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు నేను కూడా విన్నాను. అతను చెప్పిన విధానం నాకు చాలా నచ్చేసింది. అలాగే ఈర్ష కూడా కలిగింది. వైష్ణవ్ తేజ్, కృతి ఈ సినిమాలో అనుభవం ఉన్నవారిలా నటించడం వెనుక బుచ్చి హోమ్ వర్క్ కనిపించింది. విజయ్ సేతుపతి ఎప్పుడైనా సరే అద్భుతంగా నటిస్తారు. ఈ సినిమాలో అంతకు మించి అనేలా నటించారు
బుచ్చిబాబును బయటకు వదిలితే..
సుకుమార్ బుచ్చిబాబును బయటకు వదిలితే అతనితో మేము కూడా ఒక సినిమా చేసుకుంటామని సరదాగా మాట్లాడిన కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చిందని నేను అందులో మొదటి పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని కొరటాల శివ వివరణ ఇచ్చారు.